రికార్డులు లేని నగదు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

రికార్డులు లేని నగదు స్వాధీనం

Mar 31 2026 8:38 AM | Updated on Mar 31 2026 8:38 AM

యానాం: యానాం శాసనసభా నియోజకవర్గానికి వచ్చే నెల 9న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి, యానాం సరిహద్దుల్లో ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు తనిఖీలు ముమ్మరం చేశారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక హనుమాన్‌ దాబా సమీపంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఓ కారులో రూ.2.50 లక్షలను కనుగొన్నట్లు ఎన్నికల సిబ్బంది తెలిపారు. ఆ నగదుకు సంబంధించి అకౌంట్ల వివరాలు లేకపోవడంతో ఆ నగదును సీజ్‌ చేసి యానాం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి స్వాధీనం చేసినట్లు సిబ్బంది తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement