అండాదండ లేక..
ౖసైసె జోడెడ్ల బండి .. సోకై న దొరలా బండి.. అంటూ సాగే ఆ చక్రాల బండి దాదాపు మూలకు చేరింది. పూర్వం జోడెడ్ల బండి ఒక ప్రధాన రవాణా సాధనంలా, భూమి దున్నడం నుంచి పంటను ఇంటికి చేర్చడంలో కీలకంగా ఉండేది. సాంకేతికత పెరగడంలో ట్రాక్టర్లు వచ్చి జోడెడ్ల బండి జోరు తగ్గింది. అక్కడక్కడా ఎడ్ల బళ్లు ఉన్నా, దాని రూపురేఖలు మారిపోయాయి. ఆ గంటల చప్పుడు మూగబోయింది. కేవలం ఎడ్ల పందేలకు మాత్రమే చక్రాల బళ్లు ఉపయోగిస్తున్నారు. మిగిలినవి చక్రాలకు బదులుగా టైర్ల బండ్లు వాడుతున్నారు. ప్రస్తుతం ధాన్యం తరలించడానికి అక్కడక్కడా ఎడ్ల బళ్లు కనిపిస్తున్నా, అన్నీ టైరు బళ్లే. జోడెడ్ల బండి అంటే ఇలా ఉండేదని ఇప్పటి వారికి బొమ్మలు చూపించే పరిస్థితి వచ్చింది.
– పిఠాపురం
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్. ఆదివారం ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కడియం మండల కేంద్రానికి కూతవేటు దూరంలోని బుర్రిలంకలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పట్టించుకునే వారే కరవయ్యారు. కనీసం ఎన్టీఆర్ విగ్రహాన్ని శుభ్రం చేసి, దండ వేసేవారు లేకపోవడంపై ఆయన అభిమానులు నొచ్చుకున్నారు. ఆయన పెట్టిన పార్టీలో పదవులు అనుభవిస్తున్న వారైనా కనీసం ఈ విగ్రహానికి దండేద్దామన్న ఆలోచన లేకపోవడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
– కడియం
టీడీపీ ఆవిర్భావం రోజున కూడా బుర్రిలంకలో పూలదండకు నోచుకోని ఎన్టీఆర్ విగ్రహం


