ధవళేశ్వరంలో యోగ ముద్రలో..
నవ జనార్థనస్వామి ఆలయాల్లో ప్రథమమైన ధవళేశ్వరంలో బ్రహ్మచారిగా భాసిల్లుతున్న శ్రీజనార్దన స్వామి యోగ ముద్రలో దర్శనమిస్తాడు. ఉగ్రరూపంలో ఉన్న జనార్దనస్వామిని శాంతింపజేయాలన్న భక్తుల సంకల్పం మేరకు ఆలయంలో మహాలక్ష్మీదేవిని ప్రతిష్ఠించారని ప్రతీతి. ఇక్కడ భీష్మ ఏకాదశి రోజున రథోత్సవం కన్నుల పండువగా నిర్వహిస్తారు.
మడికిలో సుదర్శన ముద్ర
216 ఏ జాతీయ రహదారిలోనున్న మడికిలో ద్వితీయంగా వెలసిన శ్రీజనార్దనస్వామి సుదర్శన ముద్రలో భక్తులకు దర్శనమిస్తాడు. తూర్పు ముఖంగా వెలసి ఉన్న ఈ ఆలయంలో విగ్రహం పాదాలకు ప్రాతఃకాలంలో సూర్య కిరణాలు ప్రతి రోజు తాకుతుండటం విశేషం.
ధవళేశ్వరంలో యోగ ముద్రలో..


