స్వచ్ఛందంగా పాల్గొన్నారు
పేదలకు సంబంధించి విద్య, వైద్య రంగాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంస్కరణలు తెచ్చారు. ప్రతి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి అనుసంధానంగా వైద్య కళాశాల తీసుకొచ్చారు. వీటిని ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు సర్కార్ జీఓ జారీ చేసింది. కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో పార్టీలకు అతీతంగా అందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
– జి.శ్రీనివాస్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే,
నిడదవోలు సమన్వయకర్త
వెన్నుపోటు చంద్రబాబు నైజం
మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 2014లో అబద్ధపు హామీలతో గద్దెనెక్కారు. విద్యార్థులు, మహిళలు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేశారు. ఇప్పుడు 2024లో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తూ తిరిగి ప్రజలను మోసం చేస్తున్నారు. దీనిని తిప్పికొట్టేందుకే కోటి సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టాం. పేదలకు విద్య, వైద్యాన్ని దూరం చేసేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రను ప్రజలు స్వచ్ఛందంగా తిప్పి కొడుతున్నారు. ఇప్పటికై నా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను చంద్రబాబు ప్రభుత్వం విరమించుకోవాలి.
– తలారి వెంకట్రావు,
మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు సమన్వయకర్త
ప్రైవేటీకరణను విరమించుకునే
వరకూ పోరాటం
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను విరమించుకునేంత వరకూ వైఎస్సార్ సీపీ పోరాడుతుంది. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్ పిలుపు మేరకు అధిక సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. జిల్లాలో లక్షలాది మంది సంతకాలు చేయడం ఒక రికార్డు. కోటి సంతకాల ప్రతులను పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించేందుకు పార్టీలకు అతీతంగా ప్రజలు వేలాదిగా ర్యాలీలో పాల్గొన్నారు.
– డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి,
మాజీ ఎమ్మెల్యే, అనపర్తి సమన్వయకర్త
ఉద్యమం.. మరింత ఉధృతం
పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్య, పేదలకు ఉచిత వైద్యం అందించాలనే సంకల్పంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ప్రారంభించారు. చంద్రబాబు సర్కార్ వ్యాపార ధోరణితో వీటిని ప్రైవేటీకరించేందుకు చర్యలు చేపట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిలుపు చేసేంత వరకూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.
– డాక్టర్ గూడూరి శ్రీనివాస్,
వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ సమన్వయకర్త,
రాజమహేంద్రవరం
స్వచ్ఛందంగా పాల్గొన్నారు
స్వచ్ఛందంగా పాల్గొన్నారు
స్వచ్ఛందంగా పాల్గొన్నారు


