ఇప్పుడు ఇండిగో.. రేపు వైద్య కళాశాలలు | - | Sakshi
Sakshi News home page

ఇప్పుడు ఇండిగో.. రేపు వైద్య కళాశాలలు

Dec 8 2025 7:52 AM | Updated on Dec 8 2025 7:52 AM

ఇప్పుడు ఇండిగో.. రేపు వైద్య కళాశాలలు

ఇప్పుడు ఇండిగో.. రేపు వైద్య కళాశాలలు

రాజమహేంద్రవరం రూరల్‌: విమానాల రద్దు ద్వారా ప్రయాణికులను ఎన్నో కష్టాల పాలు చేసిన ఇండిగో సంస్థ మాదిరిగానే.. వైద్య కళాశాలలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరిస్తే ప్రజలకు ఎన్నో ఇబ్బందులు తలెత్తనున్నాయని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. బొమ్మూరులోని తన కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రైవేటు గుత్తాధిపత్యం వస్తే ప్రభుత్వ నిర్ణయాలను కూడా వెనక్కు తీసుకోవాల్సిన పరిస్థితిని ఇండిగో విషయంలో చూస్తున్నామన్నారు. ఆయనేమన్నారంటే..

ఫ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలను ఇండిగో సంస్థ అమలు చేయకపోవడంతో ప్రయాణికులు ఐదు రోజులుగా ఇబ్బందులు పడ్డారు. చివరకు ప్రభుత్వమే వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం లొంగిపోవడమే దీనికి ప్రధాన కారణంగా ప్రజలు భావిస్తున్నారు.

ఫ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖను రాష్ట్ర మంత్రి నిర్వహిస్తున్నట్లు టీడీపీ అధికార ప్రతినిధి మీడియా చర్చల్లో చెప్పడం విడ్డూరం.

ఫ ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకుని ప్రైవేటీకరిస్తే, ఆ ప్రైవేటు సంస్థలే ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితులు ఎదురవుతున్నాయనే విషయాన్ని ఇండిగో ఉదంతంతో అందరూ గమనించాలి.

ఫ ఇది చూసిన తరువాతైనా ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను తక్షణం నిలుపు చేయాల్సిన అవసరముంది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వం అన్నింటినీ అమ్మేయాలనుకోవడం దారుణం.

ఫ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రతిపక్షాలపై నిందలు వేసి కాలం గడిపేద్దామనుకోవడం చెల్లదనే విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలి.

ఫ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకొచ్చి 18 నెలలు గడుస్తోంది. రోజూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నిందించడమే పరమావధిగా ప్రభుత్వం తీరు కనిపిస్తోంది. పత్రికలు, టీవీల్లో పదేపదే అబద్ధాలు చెప్పి, నమ్మించే ప్రయత్నం చేస్తూ, జగన్‌పై విషయం చిమ్ముతూ, ప్రజల్లో చెడు అభిప్రాయం కల్పించాలన్న దురుద్దేశమే కనిపిస్తోంది.

ఫ చంద్రబాబు అబద్ధాలను ప్రజల ముందుంచేందుకు తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాం.

ఫ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రేపు వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తే భవిష్యత్తులో ఇదే పరిస్థితి అందరికీ ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది. దీనిని ఇప్పుడే నివారించాలి.

ప్రభుత్వమే అన్నీ చేస్తూండగా.. ప్రై‘వేటు’ ఎందుకు?

వైద్య పరంగా ప్రజలు దోపిడీకి గురి కాకుండా ఉండాలంటే వైద్య కళాశాలలు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉండాలి. స్థలం ఇచ్చి, భవనం కట్టి, ఉద్యోగులకు జీతాలివ్వడం సహా అన్నీ ప్రభుత్వమే చేస్తూంటే ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. ప్రజలు అధికారం ఇచ్చినది ఇష్టారీతిన పాలన చేయడానికి కాదనే విషయం గుర్తుంచుకోవాలి. ప్రజలను, జగన్‌ను విడదీయాలనుకోవడం చంద్రబాబు అండ్‌ కోది భ్రమే అవుతుంది. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌, మద్యం, తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో చంద్రబాబు చేసింది తప్పుడు ప్రచారమేననే విషయం వెలుగులోకొస్తోంది.

ఫ ప్రైవేటీకరిస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవు

ఫ విమానాల రద్దే దీనికి నిదర్శనం

ఫ వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

చెల్లుబోయిన వేణు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement