సర్వం బుగ్గి
ఫ నాలుగు
పూరిళ్లు దగ్ధం
ఫ రూ.20 లక్షల
ఆస్తి నష్టం
ప్రత్తిపాడు రూరల్: పెద్దిపాలెం గ్రామంలోని నూకాలమ్మ తల్లి గుడి వెనుక శనివారం తెల్లవారుజామున మూడు ఇళ్లు పూర్తిగా, ఒక ఇల్లు పాక్షికంగా కాలిపోయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రాళ్ల అప్పారావు ఇంట్లో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించేలోపే ఆ మంటలు రాళ్ల రాజు, రాళ్ల ఆనందరావు, నైనపు గోవింద్, అప్పలనర్సమ్మ ఇళ్లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మూడు ఇళ్లు పూర్తిగా, ఒక ఇల్లు పాక్షికంగా కాలిపోయాయి. ఇళ్లలో విలువైన గృహోపకరణలు, వంట సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. నిరుపేద కుటుంబాలు కావడంతో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాయి. అంతా గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. ఆ కుటుంబాలను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పరామర్శించారు. భవిష్యత్‌లో ప్రమాదాలు జరగకుండా ఇళ్లపై నుంచి వెళ్తున్న సర్వీస్ వైర్లను తొలగించాలని విద్యుత్ డీఈ, ఏఈలను కోరారు. బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఆ కుటుంబాలకు రూ.ఐదు వేల చొప్పున నగదు, బియ్యాన్ని అందజేశారు. ఎంపీపీ గోళ్ల కాంతి సుధాకర్, వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బెహరా దొరబాబు, పార్టీ మండల కన్వీనర్ రామిశెట్టి బులిరామకృష్ణ, వైస్ ఎంపీపీ ఏనుగు శ్రీను, నాయకులు మాకా చంటిబాబు, విత్తనాల నాగేశ్వరరావు, దేవర రాధాకృష్ణ, లొండ బాబు, దేవ లక్ష్మణ్, ఏనుగు జాన్ తదితరులు ఉన్నారు.


