తూర్పుగోదావరి జిల్లా: వందలాది ఇండిగో సర్వీసులు రోజూ రద్దవుతున్నా విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. పలు విమానయాన శాఖ మంత్రి పీరియాడిక్ రివ్యూలు ఎప్పుడు నిర్వహించారని నిలదీశారు. రోజు కి 2300 ఇండిగో సర్వీసులు నడుస్తున్నాయని, అదే సమయంలో వందలాది సర్వీసులు కూడా రద్దవుతున్నాయన్నారు. నిబంధనల ప్రకారం ఇండిగోకు మరో 900 మంది పైలట్ల అదనంగా ఉండాలన్నారు. నిబంధనలను అడ్డగోలుగా అమలు చేయాలని కోరడం తప్పితే, క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎందుకు సమీక్షించలేదన్నారు. ఇండిగో నిబంధనలు పట్టించుకోనప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఏం చేస్తుందని ప్రశ్నించారు భరత్.
తెలుగవారి ఆత్మగౌరవాన్ని రామ్మోహన్ నాయుడు మంట గలిపారని, ఇండిగో సమస్యను నారా లోకేష్ ఏరకంగా పర్యవేక్షిస్తారన్నారు. ప్యాసింజర్‌ల భద్రతను గాలికి కొదిలేశారని, జరగకూడని ప్రమాదాలు జరిగితే రీల్స్ మంత్రి సమాధానం చెబుతారా?, అహ్మదాబాద్ ఫ్లైట్ చేదు అనుభవం ఇంకా మర్చిపోలేదు.
రష్యన్ ప్రెసిడెంట్ ఇండియా పర్యటనలో ఉన్న సమయంలో ఈ రకమైన పరిస్థితి ఏర్పడటం దారుణం. కేంద్ర మంత్రి నిర్లక్ష్య ధోరణి ఈ ఘటనతో బయటపడింది. ఇండిగో సర్వీసులు రద్దుతో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి... ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. షిల్లాంగ్ లో భర్త చనిపోయిన మహిళ కాఫిన్ బాక్స్ తో ఎయిర్పోర్టులోనే 48 గంటలు నిలిచిపోవడం దారుణం. ఇండిగో సర్వీస్‌ల రద్దుతో అనేకమంది ఆన్లైన్ పెళ్లిళ్లు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది’ అని మండిపడ్డారు.


