నాలుగు బస్సుల సీజ్
రాజానగరం: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలో దివాన్ చెరువులో శనివారం నిర్వహించిన తనిఖీలో రెండు బస్సులను సీజ్ చేశారు. ఇదే విధంగా శుక్రవారం రాత్రి చేసిన తనిఖీలో మరో రెండు బస్సులను సీజ్ చేశామని రాజమహేంద్రవరం మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ సంపత్ కుమార్ శనివారం విలేకరులకు తెలిపారు. ఇంత వరకూ చేసిన తనిఖీలలో 17 కేసులు నమోదు చేసి, రూ.1,40,450 చలానాల ద్వారా వసూలు చేశామన్నారు. ఇక నుంచి ప్రతి వారంలో రెండు రోజులు తనిఖీలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు ఎం.రవికుమార్, సీహెచ్‌వీ రమణ, సహాయకులు చైతన్య సుమ, వీవీడీ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.


