అన్నప్రసాద పథకానికి రూ.88 వేల విరాళం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో వకుళమాత అన్నప్రసాద పథకానికి భక్తులు విరివిగా విరాళా లు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా శనివారం రామచంద్రపురం గ్రామానికి చెందిన కంటిపూడి సాయిరామ్‌చౌదరి – పుష్పావతి దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.50,116, రావులపాలేనికి చెందిన కూసుమంచి గంగాధరరావు, కామేశ్వ రి కావేరిలు రూ.38,116 విరాళంగా సమర్పించారు. దాతలకు దేవదాయ– ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, సిబ్బంది స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.


