
బాలల కళా కౌశలం!
● నాటక, దృశ్య కళల్లో విద్యార్థుల
ప్రతిభా పాటవాలు
● ఆకట్టుకున్న కళా ఉత్సవ్ 2025
● ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి 80 మంది హాజరు
● ఘనంగా ముగిసిన ఉత్సవాలు
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్)లో కళా ఉత్సవ్ 2025 సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం ఐదు అంశాలలో పోటీలు నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 30 పాఠశాలల నుంచి 80 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నాటక, దృశ్య కళలు, వ్యక్తిగత మరియు బృంద విభాగాలలో పలు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు. రాజమహేంద్రవరం డీఎంహెచ్ స్కూల్ 9వ తరగతి దివ్యాంగ విద్యార్థి మహబూబ్ కిజర్ మహమ్మద్ మాస్టర్ వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. ముగింపు కార్యక్రమంలో పోటీలలో విజేతలకు డైట్ ప్రిన్సిపాల్ ఆర్‌జేడీ రాజు చేతుల మీదుగా సర్టిఫికెట్లు, షీల్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో దాగివున్న కళాత్మక శక్తిని వెలికి తీయడానికి ఈ కార్యక్రమం వేదికగా ఉపయోగపడుతుందన్నారు. డైట్ కళాశాల సీనియర్ అధ్యాపకులు కేవీ సూర్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల సామాజిక మరియు సాంస్కృతిక అభివృద్ధికి ఈ పోటీలు ఉపయోగపడుతాయన్నారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. న్యాయ నిర్ణేతలుగా పీపీఎస్ జోగన్న శాస్త్రి, ఎం.శ్రీనివాస్, పుప్పాల బాపిరాజు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ ఎం.రాజేష్, వి.శిరీష ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, ఛాత్రోప్యాధ్యాయులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విజేతలు
నాటక కళల బృంద విభాగంలో కె.విమల, సీహెచ్ కళ్యాణి, జి.చరణ్ తేజ, జి.అజయ్ కుమార్ (ఎంఎస్‌ఎన్‌సీ ఎయిడెడ్ హైస్కూల్, కాకినాడ), దృశ్య కళల (2డి) వ్యక్తిగత విభాగంలో ఏ.ప్రియదర్శిని, (నెహ్రూ నగర్ మున్సిపల్ హైస్కూల్, రాజమహేంద్రవరం), శిల్ప కళ (3డి) వ్యక్తిగత విభాగంలో డి.దుర్గా జగదీష్, (జెడ్పీహెచ్‌ఎస్, రావులపాలెం), దృశ్యకళల బృంద విభాగంలో కేఆర్‌ఏ కుమారి (పీఎస్‌సీఎం జడ్పీహెచ్‌ఎస్, మండపేట).
సంప్రదాయ కథా కథనంలో బి.పరిమళ (విజ్ఞాన్ జూనియర్ కళాశాల, రాయవరం) విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

బాలల కళా కౌశలం!

బాలల కళా కౌశలం!

బాలల కళా కౌశలం!