వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం
రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా (పార్లమెంట్) పలువురు నాయకులను నియమిస్తూ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిని తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వివిధ అసెంబ్లీ నియోజకర్గాల్లో సమన్వయం చేసుకుంటూ రీజినల్ కో ఆర్డినేటర్లు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులకు సహాయంగా వ్యవహరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నియోజక వర్గాల కేటాయింపు
గిరజాల వీర్రాజు (బాబు)కు నిడదవోలు, కొవ్వూరు, చందన నాగేశ్వర్‌కు రాజానగరం, అద్దంకి ముక్తేశ్వరరావుకు రాజమహేంద్రవరం సిటీ, గోపాలపురం, నక్కా శ్రీనగేష్‌కు రాజమహేంద్రవరం రూరల్), కాకినాడ జిల్లాకు చెందిన గుబ్బల తులసీకుమార్‌కు అనపర్తి నియోజవర్గాన్ని కేటాయించారు.

వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం

వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం

వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం

వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం