సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): పెన్షనర్లను రెండు విభాగాలుగా విభజించడం తగదని పెన్షనర్ల అసోసియేషన్ కన్వీనర్ భాస్కరరావు అన్నారు. తమ డిమాండ్ల సాధనకు ఫోరమ్ ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు నగరంలోని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో పుష్కర ఘాట్ వద్ద శుక్రవారం మానవహారంగా ఏర్పాడ్డారు. ఈ సందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెన్షన్ రూల్స్‌ను మార్చిందన్నారు. దీనివల్ల పెన్షనర్ల కమిషన్ అమలుకు ముందు రిటైరైన వారు, అమలు తరువాత రిటైరైన వారు అనే రెండు వర్గాలుగా విభజిస్తారని తెలిపారు. ఫలితంగా పే కమిషన్‌కు ముందు రిటైర్ అయ్యిన ఉద్యోగులు గతంలో మాదిరిగా పెన్షన్ రివిజన్ అడిగే హక్కు కోల్పోతారన్నారు. పాత పెన్షన్‌పైనే శేషజీవితం గడపాల్సి వస్తుందన్నారు. ఎప్పటికీ వారి పెన్షన్‌లో డీఏలు తప్ప ఇతరత్రా పెరుగుదల ఉండదన్నారు. పెన్షనర్లను రెండు వర్గాలుగా విభజించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎన్ మూర్తి, కె.సన్యాసిరావు, ఏవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.
ఎస్‌జీటీ, స్కూలు
అసిస్టెంట్‌లకు పరీక్ష రేపు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కొంతమూరులోని ఎస్తేరు ఏగ్జిన్ రెసిడెన్షియల్ ఎయి డెడ్ ఎలిమెంటరీ, హైస్కూల్‌లో ఖాళీగా ఉన్న ఎస్‌జీటీ, స్కూలు అసిస్టెంట్ పోస్టులకు ఆదివారం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు శుక్రవారం తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు ఈ పరీక్షకు హాజరుకావాలన్నారు. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వర కు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. కాకినాడలోని అయాన్ డిజిటల్ జోన్, అచ్యుతాపురంలో 486 మంది అభ్యర్థులకు మొదటి సెషన్‌లో స్కూలు అసిస్టెంట్, 500 అభ్యర్థులకు రెండో సెషన్‌లో ఎస్‌జీటీ వారికి పరీక్షలు జరుగుతాయన్నా రు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, లూథర్‌గిరిలోని అయాన్ డిజిటల్ జోన్‌లో 263 మంది అభ్యర్థులకు రెండో సెషన్‌లో ఎస్‌జీటీలకు పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు హాల్‌టిక్కెట్‌తో పాటు ఏదైనా గుర్తింపుకార్డుతో పరీక్షకు ఒక గంటముందు హాజరుకావాలన్నారు. సందేహాలున్న వారు ఫోన్ నంబర్ 98485 74622, 83091 77952లో సంప్రదించాలన్నారు.
ఐవీఎఫ్ సెంటర్లలో తనిఖీలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రపంచ ఐవీఎఫ్ డే సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖాధికారులు ఐవీఎఫ్ సెంటర్లలో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ కె.వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు జీజీహెచ్‌కు చెందిన రెండు బృందాలు పలు ఐవీఎఫ్ సెంటర్లలో తనిఖీలు చేపట్టాయి. ఈ సందర్బంగా నోవా ఐవీఎఫ్ సెంటర్‌లో అసిస్టెవ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ లెవెల్ 2 ఇన్‌స్పెక్షన్ నిర్వహించి అవగాహన కల్పించారు. ఐవీఎఫ్ కేంద్రంలో సదుపాయాలు, పరికరాలు పరిశీలించారు. కేంద్రాలు ఏఆర్‌టీ చట్టం ప్రకారం నడుచుకోవాలని సూచించారు. తనిఖీ బృందంలో డిప్యూటీ డీఎంఅండ్ హెచ్‌వో పి.సరిత, గైనకాలజిస్ట్ డాక్టర్ అక్కమాంబ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వాసవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ పెథాలజీ డాక్టర్ పరాంకుశ, రేడియాలజిస్ట్ డాక్టర్ రామచంద్ర, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాజీవ్ శామ్యూల్ ఉన్నారు.