
భూగర్భ జలాల సంరక్షణపై ముగిసిన శిక్షణ
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు (సీజీడబ్ల్యూబీ) ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన భూగర్భ జల స్థిరత్వ శిక్షణ శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో సీజీడబ్ల్యూబీ రీజినల్ డైరెక్టర్ ఎన్.జ్యోతి కుమార్ మాట్లాడుతూ గోదావరి రీజియన్‌లో వాటర్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్, భూగర్భ జలాలను పెంపొందించే మార్గాలను వివరించారు. క్షేత్ర స్థాయిలో వాటర్ లెవెల్ మానటరింగ్ విధానాలు, నీరు కాలుష్యం కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కలిగించారు. మాజీ అధికారి ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ వాతావరణ, భూగర్భ జలాల మార్పులను వివరించారు. జియోసైన్సెస్ హెచ్‌ఓడీ డాక్టర్ వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీగ్రౌండ్ వాటర్ సస్టైనబుల్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ ఈస్ట్ గోదావరిశ్రీ అనే అంశంపై చర్చించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి. విజయనిర్మల, అధ్యాపకులు పాల్గొన్నారు.