
మోసానికి చిరునామా చంద్రబాబు
రాజమహేంద్రవరం రూరల్: మోసానికి చిరునామాగా చంద్రబాబు ప్రభుత్వం నిలిచిందని వైఎస్సార్ సీపీ తూర్పుగోదావరి జిల్లా క్రీస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు రెవ.విజయసారథి అన్నారు. సోమవారం కొంతమూరులోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ యోగాంధ్రా కార్యక్రమంలో పాల్గొనని తనకు పార్టిసిఫేషన్ సర్టిఫికెట్ పంపారన్నారు. అంతకంటే దారుణం ఏమిటంటే కాటవరం సెక్రటరియేట్, సీతానగరం మండలం అనే అడ్రస్సులో నివసిస్తున్నట్లుగా ఆ సర్టిఫికెట్‌లో తెలియజేశారన్నారు. గిన్నిస్‌బుక్ రికార్డుల కోసం మృతిచెందిన వారి పేరిట సైతం యోగాలో పాల్గొన్నట్లు సర్టిఫికెట్లు జారీచేయడం, వారి పనితీరుకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. పేదవాడికి అందించాల్సిన ఏ ఒక్క స్కీమును అందించని సీ ఎం చంద్రబాబు, ఒక్కరోజు యోగా దినోత్సవం కోస ం రూ.300 కోట్లు ఖర్చు పెట్టడం దారుణం అన్నారు.