
లాలిస్తూ.. బుజ్జగిస్తూ..
పెంచిన బంధం పెనవేసుకుంది.. పెంపుడు జంతువులంటే ఎనలేని ప్రేమ కనిపించింది.. లాలిస్తూ, బుజ్జగిస్తూ వాటికి యజమానులు టీకాలు వేయించారు. ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు వేశారు. ఆదివారం రాజమహేంద్రవరం ఏరియా పశు వైద్యశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడ తమ పెంపుడు శునకాలు, పిల్లులు, కోళ్లకు యజమానులు దగ్గరుండి మరీ టీకాలు వేయించారు. అలాగే ఇక్కడకు పాములను సైతం తీసుకురావడం గమనార్హం. శునకాలను అల్లారు ముద్దుగా చూసుకున్నారు. అవి సైతం యజమానులపై ఎంతో ప్రేమ చూపుతూ.. విధేయతతో మెలిగాయి.
– ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్)/ సాక్షి ఫొటోగ్రాఫర్, రాజమహేంద్రవరం