స్వామివారి పెళ్లికి అంకురార్పణ | - | Sakshi
Sakshi News home page

స్వామివారి పెళ్లికి అంకురార్పణ

Jun 6 2025 12:24 AM | Updated on Jun 6 2025 12:24 AM

స్వామ

స్వామివారి పెళ్లికి అంకురార్పణ

మామిడికుదురు: జ్యేష్ఠ శుద్ధ దశమి శుభ ముహూర్తంలో వేద మంత్రాలు, భక్తుల గోవిందనామ స్మరణలు, మంగళ వాయిద్యాలు, కర్పూర పరిమళ సుగంధ ద్రవ్యాల నడుమ శ్రీబాలబాలాజీ స్వామి తిరు కల్యాణోత్సవాలకు గురువారం అంకురార్పణ జరిగింది. పాంచరాత్ర ఆగమానుసారం శ్రీబాల బాలాజీ స్వామి వారి వార్షిక దివ్య తిరు కల్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టారు.

ఆలయ ఉప ముఖ్య అర్చక గొడవర్తి శ్రీనివాసాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి వారి శిష్యులు యాజ్ఞిక బ్రహ్మ చలమచర్ల వేణుగోపాలాచార్యులు బృందం ఆధ్వర్యంలో శ్రీవారి వార్షిక కల్యాణోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. బాల బాలాజీ స్వామితో పాటు శ్రీదేవి, భూదేవిలను చూడముచ్చటగా అలంకరించారు. బుగ్గన చుక్క పెట్టి, నుదుటన కల్యాణం తిలకం దిద్ది పెండ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా ముస్తాబు చేశారు. ఎటువంటి ఆటంకాలు కలుగకుండా స్వామి వారి కల్యాణోత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని కోరుతూ విష్వక్సేనారాధన కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు. ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు దంపతులు 108 కలశాలతో పాటు బ్రహ్మ కలశంలో పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పసుపు, కుంకుమతో స్నపన తిరు మంజన సేవను వైభవోపేతంగా జరిపించారు. సేకరించిన పుట్ట మన్నును తొమ్మిది పాత్రల్లో నింపి అంకారార్పణ కార్యక్రమాన్ని నయనానందకరంగా జరిపించారు. పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాశనం, పరిషదక్షిణ, మృత్సంగ్రహణం, హోమం, తదితర కార్యక్రమాలు వైభవోపేతంగా నిర్వహించారు. కల్యాణోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ దీపాలు, పుష్పాలంకరణ భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి.

నేటి కార్యక్రమాలు

కల్యాణోత్సవంలో భాగంగా రెండవ రోజు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి శుక్రవారం ఉదయం 6 గంటలకు ఆరాధన, శ్రీస్వామి వారికి సహస్ర నామార్చన. ఏడు గంటలకు బాల భోగం నివేదన, నిత్య హోమం, బలిహరణ, తీర్థ ప్రసాద గోష్ఠి. ఎనిమిది గంటలకు చతుస్థానార్చనలు. 10 గంటలకు ధ్వజారోహణ, నీరాజన మంత్ర పుష్పాలు. తీర్థ ప్రసాద గోష్ఠి. రెండు గంటలకు శ్రీస్వామి వారి గ్రామోత్సవం (ఊరేగింపు) అనంతరం ఆరాధన. 6 గంటలకు సాయంకాలార్చన, చతుస్థానార్చనలు, నిత్యోపాసన, బలిహరణ. 8 గంటలకు స్వామి వారి రాయబారోత్సవం (ఎదుర్కోలు ఉత్సవం). 9.15 గంటలకు శ్రీస్వామి వారి దివ్య తిరు కల్యాణ మహోత్సవం. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 9 గంటలకు శ్రీలలితా విష్ణు సహస్ర నామ పారాయణం, 11 గంటలకు శ్రీఅన్నమాచార్య సంకీర్తన విభావరి, మధ్యాహ్నం ఒంటి గంటకు స్వామి వారి తిరువీధి ఉత్సవంలో భాగంగా కోలాటం ప్రదర్శన.

కల్యాణ తిలకం దిద్దుకున్న బాలబాలాజీ

స్వామివారి పెళ్లికి అంకురార్పణ1
1/2

స్వామివారి పెళ్లికి అంకురార్పణ

స్వామివారి పెళ్లికి అంకురార్పణ2
2/2

స్వామివారి పెళ్లికి అంకురార్పణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement