అనపర్తి
నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తల కోలాహలం నడుమ.. అనపర్తిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ పుట్టిన రోజు కేక్‌ను మాజీ ఎమ్మెల్యే, పార్టీ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి కేక్ కట్ చేశారు. రామవరంలో గ్రామ శాఖ ఆధ్వర్యాన పార్టీ నేతలు కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు. బిక్కవోలు మండలం తొస్సిపూడి గ్రామంలో వస్త్ర, అన్నదానం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెదపూడి మండలం జి.మామిడాడలో యువకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, కేక్ కట్ చేశారు.


