పార్లమెంటరీ కార్యాలయంలో..
రాజమహేంద్రవరం తిలక్ రోడ్డులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యాన కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చిన జగన్ నిజమైన సంక్షేమాన్ని ప్రజలకు అందించారని ఈ సందర్భంగా గూడూరి అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసి, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పోలు విజయలక్ష్మి, మానే దొరబాబు, ముప్పన ప్రభాకర్ చౌదరి, మార్తి లక్ష్మి, మారిమ నాగేశ్వరరావు, న్యాయవాది సాదిక్ తదితరులు పాల్గొన్నారు.
కొవ్వూరు
నియోజకవర్గంలోని కొవ్వూరు, తాళ్లపూడి మండలాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆధ్వర్యాన ఆశ్రయ ఫౌండేషన్ వద్ద రోగులకు భోజనాలు ఏర్పాటు చేశారు.
పెద్దేవంలో 50 మంది వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఒరిగేటి అశోక్ ఆధ్వర్యాన ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు వృద్ధులు, వితంతువులకు దుప్పట్లు, పండ్లు పంచారు. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
పార్లమెంటరీ కార్యాలయంలో..


