జననేతకు జేజేలు
సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన దార్శనికుడు.. సంక్షేమ ప్రదాత.. పేదల బాంధవుడు.. విద్యార్థులకు మావయ్యగా.. పింఛనర్లకు పెద్ద కొడుకుగా.. అక్కచెల్లెమ్మలకు సోదరుడిగా.. రాజకీయాల్లో సమున్నత విలువలకు పెద్దపీట వేసిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు జిల్లావ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు జననేత జన్మదిన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని జేజేలు పలికారు. కేక్‌లు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రక్తదాన శిబిరాలు, దుప్పట్లు, పండ్ల పంపిణీ తదితర రూపాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించి, తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమ ప్రియతమ నేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
సంక్షేమ ప్రదాత జగన్
రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యాన వైఎస్ జగన్ పుట్టిన రోజు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్‌కే దక్కుతుందని అన్నారు. ఎన్నో ప్రతిష్టాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టి, ప్రజల గుండెల్లో తనకంటూ ఒక స్థానాన్ని పదిలపరచుకున్నారని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు ఉప్పులూరి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శులు గొందేశి శ్రీనివాసరెడ్డి, నక్కా రాజబాబు, గిరిజాల బాబు, నక్కా శ్రీనగేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
ఫ జిల్లావ్యాప్తంగా సంబరాలు చేసుకున్న
ప్రజలు
ఫ విస్తృతంగా సేవా కార్యక్రమాలు


