రాజమండ్రి సిటీలో రక్తదానం
ఇచ్చిన మాటకు కట్టుబడే నిజమైన నాయకుడు వైఎస్ జగన్ అని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. రాజమండ్రి సిటీలో నాయకులు, కార్యకర్తల కోలాహలం జగన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ధన్వంతరి బ్లడ్ బ్యాంక్‌లో యువజన విభాగం సిటీ అధ్యక్షుడు బిల్డర్ చిన్నా ఆధ్వర్యాన సుమారు 100 మంది రక్తదానం చేసి, జననేత పట్ల తమ ప్రేమను చాటుకున్నారు. ఇందులో భరత్‌రామ్ స్వయంగా రక్తదానం చేశారు. కోటగుమ్మం వద్ద ఉమ, మిత్ర బృందం ఆధ్వర్యాన కేక్ కట్ చేసి, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. మోరంపూడి జంక్షన్ వద్ద 40 అడుగుల జననేత ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసిన భరత్.. అనంతరం కేక్ కట్ చేసి, పేదలకు దుప్పట్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చందన నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


