కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రతీ సోమవారం నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం’(ిపీజీఆర్‌ఎస్)కు 29 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి పోలీసు కార్యాలయానికి వచ్చిన ప్రజల నుంచి వివిధ రకాల అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను స్వయంగా జిల్లా అడినల్ ఎస్పీ(అడ్మిన్) ఎన్‌బీఎం మురళీకృష్ణ అడిగి తెలుసుకున్నారు. సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా మాట్లాడి ఫిర్యాదిదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయవలసిందిగా సూచించారు. కుటుంబ సమస్యల గురించి, ఛీటింగ్, కొట్లాట, దొంగతనం కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించారు.