రేషన్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం పట్టివేత

Mar 10 2025 12:06 AM | Updated on Mar 10 2025 12:06 AM

రేషన్

రేషన్‌ బియ్యం పట్టివేత

నిడదవోలు: జాతీయ రహదారిపై పెరవలి మండలం కండవల్లి వద్ద ఆదివారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పౌర సరఫరాల అధికారులు పట్టుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు విప్పర్రు గ్రామం నుంచి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలేనికి వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 10 టన్నుల రేషన్‌ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ పెరవలి డిప్యూటీ తహసీల్దార్‌ ఎస్‌ఎస్‌ సుధీర్‌రెడ్డి తన సిబ్బందితో సీజ్‌ చేశారు. పౌర సరఫరాల చట్టం 6ఏ కేసు నమోదు చేశారు. వ్యాన్‌ను పెరవలి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వాహనం డ్రైవర్‌ తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వైచర్ల శివకిరణ్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్టు సుధీర్‌రెడ్డి తెలిపారు.

షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం

మూడిళ్లు దగ్ధం రూ.2 లక్షల ఆస్తినష్టం

అమలాపురం రూరల్‌: మండలంలోని సమనస పరిధిలో ఉన్న రంగాపురం బాబునగర్‌లో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించి, మూడు ఇళ్లు దగ్ధమయ్యాయి. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా సత్తాల చింతాలు, ఆకుమర్తి పురుషోత్తమరాజు, సత్తాల దుర్గారావుకు చెందిన ఇళ్లు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. సమాచారం అందుకున్న అమలాపురం అగ్నిమాపకాధికారి మురళీ కొండబాబు ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. వేగంగా మంటలు చుట్టుముట్టడంతో ఇళ్లల్లోని వస్తువులు తీసుకునే అవకాశం లేకుండా పోయిందని బాధితులు విలపించారు. ఫర్నిచర్‌, ధ్రువీకరణ పత్రాలు, నగదు తదితర వస్తువులు బూడిదయ్యాయి. ఈ సంఘటనలో సుమారు రూ.రెండు లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు బాధితులను పరామర్శించారు. బాధితులకు 25 కేజీల బియ్యం, రూ.10 వేల వంతున సాయం అందించారు.

రేషన్‌ బియ్యం పట్టివేత1
1/1

రేషన్‌ బియ్యం పట్టివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement