కాకినాడ జిల్లా
ఏలేశ్వరం 162
కాకినాడ 3,987
తుని 3,073
కోనసీమ జిల్లా
అమలాపురం 1,588
రామచంద్రపురం 1,795
రావులపాలెం 2,295
రాజోలు 1,089
2024 నుంచి 2025 ఫిబ్రవరి నెలాఖరు వరకూ డిపోల వారీగా కార్గో ఆదాయం (రూ.)
రాజమహేంద్రవరం 8,07,00,000
గోకవరం 23,72,000
నిడదవోలు 28,75,000
కొవ్వూరు 1,99,00,000
ఏలేశ్వరం 32,00,000
కాకినాడ 3,53,00,000
తుని 1,78,00,000
అమలాపురం 1,91,00,000
రామచంద్రపురం 98,00,000
రావులపాలెం 2,19,00,000
రాజోలు 97,48,000
ఉమ్మడి జిల్లాలో డిపోల
వారీగా డీజీటీ వాహనాలు
రాజమహేంద్రవరం 1
కొవ్వూరు 2
అమలాపురం 3
రాజోలు 2
జిల్లాల వారీగా ఏటీబీలు
తూర్పుగోదావరి 34
కాకినాడ 16
కోనసీమ 15
2024 నుంచి 2025 ఫిబ్రవరి నెలాఖరు
వరకూ డిపోల వారీగా డోర్ డెలీవరీ సేవలు
తూర్పు గోదావరి జిల్లా
రాజమహేంద్రవరం 8,298
గోకవరం 695
నిడదవోలు 514
కొవ్వూరు 734
● ఆర్టీసీ డోర్ డెలివరీలో
ఉమ్మడి జిల్లాకు రెండో స్థానం
● దండిగా రాబడి
రాజమహేంద్రవరం సిటీ: ప్రయాణికులతో పాటు సరకుల రవాణా ద్వారా కూడా ఏపీఎస్ ఆర్టీసీ ఆదాయం పెంచుకుంటోంది. సామాన్యులకు అతి తక్కువ చార్జీలతో సరకుల రవాణాను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. అధిక బరువు సరకులుంటే ఆర్టీసీకి చెందిన డిపో గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ (డీజీటీ) వాహనాన్ని వినియోగదారు వద్దకే పంపించి, వాటిని రవాణాకు చర్యలు చేపట్టింది. అతి తక్కువ ధరకే సరకులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నిర్ణీత సమయంలో భద్రంగా చేరవేస్తూ వినియోగదారుల మన్ననలు పొందుతోంది. మొదట్లో కార్గో సేవలు ముఖ్యమైన ఆర్టీసీ బస్టాండ్లకే పరిమితమయ్యాయి. అక్కడే ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేసి, సరకులు రవాణా చేసేవారు. ప్రజల నుంచి మంచి ఆదరణ రావడంతో మరో అడుగు ముందుకేసి, పట్టణాల్లో సరకుల డోర్ డెలివరీ సేవలకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి జిల్లాలోని 11 డిపోల్లో 10 కిలోమీటర్ల పరిధిలో 50 కేజీల వరకూ సరకులను డోర్ డెలివరీ ద్వారా అందిస్తున్నారు. ఈవిధంగా డోర్ డెలీవరీ సేవల్లో రాష్ట్రంలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ప్రయాణికుల సేవలతో పాటు కార్గో సేవలను మరింత సులభంగా అందించే లక్ష్యంతో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆథరైజ్డ్ టికెట్ బుకింగ్ కౌంటర్లు (ఏటీబీ) కూడా ఏర్పాటు చేసింది. తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.
ఏటీబీ కౌంటర్లకు అవకాశం
ఆర్టీసీ రవాణాలో భాగస్వాములయ్యేలా యువతకు ఏటీబీ కౌంటర్లు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో రూ.వెయ్యి, నగర, పట్టణ ప్రాంతాల్లో రూ.5 వేల చొప్పున ధరావత్తు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించే మార్గంలో కౌంటర్ ఏర్పాటుకు అవసరమైన గదితో పాటు కంప్యూటర్, వేయింగ్ మెషీన్ ఏర్పాటు చేసుకోవాలి. ఆసశక్తి ఉన్న యువత రాజమహేంద్రవరంలోని జిల్లా ప్రజా రవాణా శాఖ కార్యాలయంలో సంప్రదించాలి.
– మాధవ్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, ఏపీఎస్ ఆర్టీసీ, రాజమహేంద్రవరం
అద్వితీయం