అప్పన్నపల్లి బాలాజీ హుండీ ఆదాయం రూ.56.08 లక్షలు | - | Sakshi
Sakshi News home page

అప్పన్నపల్లి బాలాజీ హుండీ ఆదాయం రూ.56.08 లక్షలు

Mar 31 2026 7:26 AM | Updated on Mar 31 2026 7:26 AM

మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. 68 రోజులకు స్వామి వారికి హుండీల ద్వారా రూ.56.08 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ఎం.రాంబాబురెడ్డి తెలిపారు. 17 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండిని భక్తులు హుండీల్లో కానుకలుగా సమర్పించారన్నారు. అమలాపురం గ్రూపు టెంపుల్స్‌ కార్యనిర్వహణాధికారి ఆర్‌.శ్రీనివాస్‌ పర్యవేక్షణలో జరిగిన హుండీ లెక్కింపులో ఆలయ వంశపారం పర్య ధర్మకర్త మొల్లేటి లక్ష్మీనారాయణ, స్థానికులు, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

నరసన్న హుండీల

ఆదాయం రూ.37,08,338

సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. భక్తుల నుంచి కానుకలుగా మొత్తం రూ.37,08,338 ఆదాయం సమకూరింది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకూ 53 రోజులకుగాను పై ఆదాయం వచ్చింది. ఎండోమెంట్స్‌ తనిఖీదారు జె.రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో పై లెక్కింపు జరిగింది. కాగా ఆదాయం మొత్తంలో మెయిన్‌ హుండీల ద్వారా రూ.35,93,457, గుర్రాలక్క ఆలయ హుండీల ద్వారా రూ.27,872, అన్నదాన హుండీల ద్వారా రూ.87,009 సమకూరినట్టు ఈవో ఎంకేటీఎన్‌వీ ప్రసాద్‌ తెలిపారు. ఎంపీటీసీ బైరా నాగరాజు, సర్పంచ్‌ కొండా జాన్‌బాబు, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement