ఫీజులు కట్టించుకోవడం లేదని నిరసన | - | Sakshi
Sakshi News home page

ఫీజులు కట్టించుకోవడం లేదని నిరసన

Mar 27 2026 9:22 AM | Updated on Mar 27 2026 9:22 AM

తాళ్లరేవు: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బు కడితేనే పరీక్షల ఫీజు కట్టించుకుంటామని కోరంగి కై ట్‌ కళాశాల ప్రతినిధులు బెదిరించారంటూ గురువారం ఆ కళాశాల గేటు వద్ద ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆందోళన చేశారు. ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు కడితేనే పరీక్షల ఫీజు కట్టించుకుంటామని నిబంధన విధించడంతో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎం.గంగాసూరిబాబు తదితరులు వెళ్లగా యాజమాన్యం బెదిరింపులకు పాల్పడిందంటూ గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులను వేధించడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్న కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement