అల్లవరం: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాన్ని బూచిగా చూపి, ఆక్వా రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం సంక్షోభంలో నెట్టివేసిందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ అన్నారు. అల్లవరం మండలం గోడిలోని ఆయని నివాసంలో మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ మాట్లాడుతూ చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలతో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో పడిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.50 లక్షల హెక్టార్లలో సుమారు ఆరు లక్షల మంది రైతులు ఆక్వా సాగు చేస్తున్నాన్నారు. వారందరూ ఉత్పత్తి చేసిన రొయ్యలను ఒక సామాజికవర్గానికి చెందిన కొనుగోలుదారులందరూ సిండికేట్‌గా మారి, కౌంట్ ధరలను 40 శాతం తగ్గించి, ఆక్వా రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. వారందరికీ చంద్రబాబు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్‌లకు అన్ కండిషనల్‌గా విద్యుత్ సబ్సిడీ ఇస్తామని హామీచ్చిన చంద్ర బాబు, అధికారం చేపట్టి రెండేళ్లయినా ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ అందించడంలో విఫలమయ్యారన్నారు. అలాగే ధరల స్థిరీకరణ నిధులు ఎందుకు సమకూర్చలేదో ఆయన సమాధానం చెప్పాలన్నారు. ఏపీ నుంచి 80 శాతం రొయ్యల ఎగుమతులు యూరప్, అమెరికాలకు జరుగుతున్నాయన్నారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధానికి, మనకూ ఎలాంటి సంబంధం లేకపోయినా కౌంట్ ధరలు నానాటికి తగ్గిపోతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని కాపాడారని తెలిపారు. కరోనా సమయంలోనూ ఆదుకున్నారని, ధరల స్థిరీకరణ ఏర్పాటుచేసి ఆక్వా రైతులకు భరోసా నిలిచారని తెలిపారు.
ఫ చంద్రబాబు విధానాలే కారణం
ఫ ఎమ్మెల్సీ ఇజ్రాయిల్


