వైఎస్సార్ సీపీ కౌన్సిలర్‌పై టీడీపీ కార్యకర్త దాడి
రామచంద్రపురం: ఉద్దేశ పూర్వకంగా తనపై టీడీపీకి చెందిన వ్యక్తి దాడి చేసి గాయపర్చాడని స్థానిక 13వ వార్డుకు చెందిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ కేతా శ్రీను పట్టణ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి ఒక హోటల్ వద్దకు టిఫిన్ చేసేందుకు వెళ్లిన తనపై ఇటీవల టీడీపీలో చేరిన లంక శ్రీను బూతులు తిడుతూ అకారణంగా దాడి చేసి గాయపర్చాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా తమ పార్టీ కౌన్సిలర్‌పై జరిగిన దాడి విషయాన్ని తెలుసుకున్న పార్టీ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై ఎస్.నాగేశ్వరరావును కలసి మాట్లాడారు. కౌన్సిలర్ శ్రీనుపై దాడి విషయంలో కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేసి న్యాయం చేయాలని కోరారు. ఎస్సై మాట్లాడుతూ జరిగిన ఘటనపై దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. పార్టీ కౌన్సిలర్ వాడ్రేవు సాయిప్రసాద్, పార్టీ నేతలు పెంట పాటి శ్రీను, కేతా శ్రీను, జుత్తుగ గులాంబాషా సూర్యప్రకాశ్ వెంట ఉన్నారు.
వైఎస్సార్ సీపీ కౌన్సిలర్‌పై టీడీపీ కార్యకర్త దాడి


