జగ్గిరెడ్డిని ఎదుర్కోలేక చవకబారు విమర్శలు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు
అధ్యక్షులు జున్నూరి రామారావు
అల్లవరం: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డిని ఎదుర్కోలేకే కూటమి నేతలు చవకబారు విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరి రామారావు (బాబీ) ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రావులపాలెంలోని ఎంకేఆర్ సెంటర్లో శ్రీకృష్ణదేవరాయలు చిత్రపటాన్ని జగ్గిరెడ్డి అవమానించారని అధికార పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిజం కాదని రామారావు తెలిపారు. మహనీ యుని విగ్రహాన్ని రాత్రి వేళల్లో ప్రతిష్ఠించాల్సిన అవసరం ఏముందని, ఈ సెంటర్లో తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయన్న ఉద్దేశం తప్ప మరే దురుద్దేశం లేదన్నారు. ఎంకేఆర్ సెంటర్లో ఎలాంటి విగ్రహాలు ప్రతిష్ఠించరాదని పంచాయతీ తీర్మానం చేసిందని గుర్తు చేశారు. ఆ తీర్మానాన్ని కాదని రాత్రికి రాత్రే శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయన్ని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ప్రతిష్ట కలిగిన మహానీయునికి మీరేచ్చే గౌర వం ఇదేనా అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకూ కాపు సామాజిక వర్గానికి చెందిన వారిపై దాడులు జరుగుతున్నా కాపు నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కందుకూరు నియోజకవర్గంలో ఓ కాపు సోదరుడిని కారుతో తొక్కించి హత్య చేసిన ఘటనపై, ఐ.పోలవరం మండలం బాణాపురంలో ఓ కాపు బాలికపై అత్యాచారం జరిగినప్పుడు మీరెందుకు ప్రశ్నించలేదో సమాధానం చెప్పాలని అన్నారు. కాపుల ఆరాధ్య దైవంగా భావించే రంగాను చంపినప్పుడు, దేవాలయం లాంటి శాసనసభలో ఎమ్మెల్యే బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంలో అరాచకాలు అధికమయ్యాయని అన్నారు.


