రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు
రావులపాలెం: రావులపాలెంలో శ్రీకృష్ణదేవరాయ విగ్రహ ఏర్పాటులో తలెత్తిన శాంతిభద్రతల సంఘటనలో ప్రస్తుతం పోలీస్ పహారా కొనసాగుతుందని, ఎవరైనా సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. ఆదివారం సాయంత్రం రావులపాలెం పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ అదుపులో ఉందని, దీనికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవన్నారు. అలాగే వైజాగ్ చెందిన ఒక వ్యక్తిపై సోషల్ మీడియాలో పెట్టిన చలో రావులపాలెం పోస్ట్ కారణంగా కేసు నమోదు చేశామన్నారు.
సంక్రాంతి నేపథ్యంలో గుండాటలే, కోడి పందేలు నిర్వహిస్తే కేసులు పెడతామన్నారు. సమావేశంలో డీఎస్పీ సుంకర మురళీమోహన్, సీఐ ఎం.శేఖర్‌బాబు పాల్గొన్నారు.


