దాడి ఘటనపై హత్యాయత్నం కేసు
గంటిలో పోలీస్ పికెట్ ఏర్పాటు
కొత్తపేట: మండల పరిధిలోని గంటి గ్రా మంలో శుక్రవారం రాత్రి ఇద్దరు యువకులపై చాకుతో దాడి చేసిన ఘటనపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్టు ఎస్సై జి.సురేంద్ర తెలిపారు. పాత గొడవల నేపథ్యంలో కర్రి మణికంఠ అనే యువకుడిని కడుపులో పొడవగా తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దీని కి సంబంధించి ఎస్సై సురేంద్ర శనివారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గత నెల 31న రాత్రి గంటి వైన్ షాప్ వద్ద కర్రి దుర్గామణికంఠ, దేవుడు మహేష్ అనే యువకులతో అదే గ్రామం పెదపేటకు చెందిన కన్నా, విశాల్, నాని గొడవ పడ్డారు. ఈ నెల 2న రాత్రి దుర్గామణికంఠ రావులపాలెం నుంచి ఇంటికి వెళుతుండగా గంటి గ్రామం దుర్గమ్మ గుడి సెంటర్ వద్ద విశాల్, కన్నా, నాని ఆపి మరలా గొడవ పడ్డారు. దానితో మణికంఠ తన పెద నాన్న కుమారుడు కర్రి సత్యసాయి నాగదుర్గారావుకు ఫోన్ చేయగా అతను అక్కడకు చేరుకున్నాడు. ఇంతలో కన్నా తనతో పాటు తెచ్చుకున్న చాకుతో మణికంఠను ఎడమ వైపు కడుపులో పొడిచాడు. దానితో దుర్గారావు అడ్డువెళ్లగా అతని ఎడమ కాలుపై పొడిచాడు. విశాల్, నాని కూడా ఇరువురిని కొ ట్టారు. గాయపడిన ఇద్దరినీ వెంటనే 108 అంబులెన్స్‌లో కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మణికంఠకు ప్రాథమిక చికిత్స అనంతరం రావులపాలెంలోని ఒక ప్రైవేట్ ఆ స్పత్రికి తరలించారు. దుర్గారావు ఫిర్యా దు మేరకు కన్నా, విశాల్, నానిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఈ ఇరువర్గాల మద్య గొడవల నేపథ్యంలో గంటిలో పికెట్ ఏర్పాటు చేశామన్నారు. కాగా శనివారం డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ వై.రాంబాబు, రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఇరువర్గాల పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.


