తండ్రి రుణం తీర్చుకునేందుకు..
కె.గంగవరం: మండల పరిధిలోని కోటిపల్లి గ్రామంలో పేకేటి సత్యనారాయణ (కాంతారావు) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు కుమారులు లేకపోవడంతో ఉన్న ముగ్గురు కుమార్తెల్లో ఒక కుమార్తె అనూష తండ్రి మృతదేహానికి హిందూ సంప్రదాయం ప్రకారం తలకొరివి పెట్టారు. కాంతారావు స్థానికంగా ఉన్న పీడబ్ల్యూడీ కార్యాలయంలో గుమస్తాగా పని చేస్తున్నారు. ఆయన ఆకస్మిక మృతికి కార్యాలయ సిబ్బంది సంతాపం ప్రకటించి దహన సంస్కారాలకు రూ. 10 వేలు అందించారు. తండ్రి మృతదేహానికి కూతురు తలకొరివిపెట్టడం చూసి స్థానికులు, బంధువులు, గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు.


