యూరియా ఇవ్వలేఖ
సాక్షి, అమలాపురం: తిరుపతి శ్రీవారి దర్శనానికి, చిన్న ఉద్యోగాలకు మాత్రమే ఇప్పటి వరకు సిఫారసు లేఖలు పట్టుకుని వెళ్లేవారిని చూసి ఉంటారు. కానీ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో యూరియా బస్తాలు కావాలంటే అటు వ్యవసాయశాఖ అధికారితో పాటు స్థానిక టీడీపీ, జనసేన పార్టీకి చెందిన చోటా మోటా నాయకులు సిఫారసులు ఉండాల్సిందే. ప్రస్తుతం రెండు బస్తాల యూరియాకు కూడా రైతులు పడరానిపాట్లు పడుతున్నారు. యూరియా కావాలంటే వారికి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి రాజకీయ నాయకుడి సిఫారసు లేఖ, రెండోది గంటల పాటు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్) ముందు పడిగాపులు పడడం.
జిల్లాలో..
జిల్లాలోని గోదావరి డెల్టా పరిధిలో ఇంకా సగం చేలల్లో కూడా రబీ నాట్లు పడలేదు. సుమారు 1.73 లక్షల ఎకరాల్లో రబీ వరిసాగు జరుగుతోందని అంచనా కాగా, ఇప్పటి వరకు కేవలం 34 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. సుమారు 70 వేల ఎకరాలకు సరిపడా నారుమడి సిద్ధంగా ఉంది. అయినా కూడా యూరియా దొరకడం రైతులకు గగనమైపోయింది. రబీ ఆకుమడిలో కేవలం ఆరు నుంచి ఏడు కేజీల యూరియా వేస్తారు. తరువాత నాట్లు వేసిన సమయంలో ఒకసారి, పదిహేను రోజులకు, 30 నుంచి 40 రోజులకు ఒకసారి చొప్పున యూరియా వేస్తుంటారు.
యూరియా కొరత
జిల్లాలో పెద్ద ఎత్తున యూరియా వాడే అవకాశం లేదు. అయినా రైతులను కొరత పట్టి పీడిస్తోంది. జిల్లాలో మొత్తం రబీ కాలంలో 29,700 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఎప్పుడూ సుమారు నాలుగు వేల మెట్రిక్ టన్నులకు తక్కువ కాకుండా యూరియాను అందుబాటులో ఉంచుతున్నట్టు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్ సాగు జిల్లాలో అనుకున్న స్థాయిలో జరగలేదు. 1.80 లక్షల ఎకరాల్లో ఆయకట్టుకు గాను 1.53 లక్షల ఎకరాల్లో మాత్రమే జరిగింది. దీని వల్ల మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ కొరత తక్కువ. అయినప్పటికీ కొందరు ప్రైవేటు ఏజెంట్లు రూ.260.50 యూరియా బస్తాను రూ.400కు అమ్మకాలు చేశారు.
అధికార పార్టీ సిఫారసులుంటేనే..
ఫ రబీలో సాగు ఆరంభంలోనే యూరియా కోసం రైతులు గంటల పాటు పడిగాపులు పడుతున్నారు. అధికారితో పాటు టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, చోటా మోటా నాయకుల సిఫారసులు ఉంటేనే పీఏసీఎస్‌లో యూరియా అందిస్తున్నారు.
ఫ పీఏసీఎస్, ప్రైవేట్ ఏజెంట్ల వద్ద యూరియా అమ్మకాలకు సంబంధించి ఇప్పటికే రేషన్ విధించారు. వ్యవసాయ శాఖ అధికారి ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేశారు. దీనితో పాటు ఎకరాకు రెండు బస్తాల ఇస్తామనడం వల్ల పెద్ద కమతాలున్న రైతులకు ఇబ్బందిగా మారింది.
ఫ యూరియా కొరత లేదని ఒక వైపు వ్యవసాయ శాఖ అధికారులు మరో వైపు జిల్లా పరిపాలన యంత్రాంగం ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తున్నారు. ఇదే సమయంలో గడిచిన నాలుగైదు రోజులుగా ఉద్యాన రైతులకు యూరియా బస్తాలు ఇవ్వడం నిలుపుదల చేయాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఫ జిల్లాలో కొబ్బరి, కోకో తోటలలో ఇప్పుడు దుక్కులు చేసి రైతులు యూరియా ఇతర ఎరువులను వినియోగిస్తుంటారు. అలాగే గత ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు గోదావరికి వరద ఉండడం లంక భూముల్లో కూరగాయ పంటలు, పువ్వుల సాగు మొదలు కాలేదు. ఇప్పుడు ఆ తోటల్లో కూడా యూరియా వినియోగించాల్సి ఉంది. ఈ సమయంలో యూరియా దొరకకపోతే ఇబ్బందులు తప్పవని రైతులు వాపోతున్నారు.
ఫ కొత్తపేట నియోజకవర్గ పరిధిలో యూరియా పంపిణీ దారుణంగా ఉంది. ముఖ్యంగా వానపల్లి, కొత్తపేట ఏపీసీఎస్‌లలో యూరియా వచ్చినప్పుడు రైతులు గంటల పాటు ఎదురు తెన్నులు చూస్తున్నారు.
ఫ అల్లవరం మండలంలో గుళికల రూపంలో ఉన్న యూరియా బస్తాలు కావాలంటే నానో యూరియా తప్పనిసరిగా కొనాలని వ్యవసాయ శాఖ అధికారులు పట్టుబడుతున్నారు. మూడు బస్తాలు అంతకు పైబడి యూరియా కొనుగోలు చేయాలంటే కనీసం లీటరు నానో యూరియా కొనాలని ఒత్తిడి చేస్తున్నారని రైతులు చెబుతున్నారు.
సిఫారసు లేఖలున్న వారికే పంపిణీ
అవస్థలు పడుతున్న రైతులు
చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం
తొలుత వ్యవసాయ శాఖ
అధికారుల ధ్రువీకరణ
ఆపై అధికార పార్టీ నేతలు
చెప్పిన మేరకు అందజేత
యూరియా ఇవ్వలేఖ
యూరియా ఇవ్వలేఖ
యూరియా ఇవ్వలేఖ


