హోరెత్తిన నినాదాలు
పాదయాత్ర బండార్లంకకు చేరుకున్నాక జిల్లా సంతకాల సేకరణ ప్రతుల బాక్సుల వాహనం అక్కడి నుంచి అంబాజీపేట, ముక్కామల, కొత్తపేట, రావులపాలెం, గోపాలపురం మీదుగా సిద్ధాంతం వంతెన వరకూ కార్ల ర్యాలీతో సాగింది. దాదాపు 40 కిలోమీటర్ల మేర సాగిన ఈ ర్యాలీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పార్టీ కో ఆర్డినేటర్లు కార్ల కాన్వాయ్‌తో, పార్టీ నాయక, కార్యకర్తల గణాలతో పోటీ పోటీగా అమలాపురానికి చేరుకున్నారు. ప్రతుల వాహనం సిద్ధాంతం వంతెనకు చేరుకున్నాక అక్కడి నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు, పార్టీ కో ఆర్డినేటర్లు, కొంత మంది పార్టీ నాయకులతో తాడేపల్లికి బయలుదేరింది. ఈ కార్యక్రమా ల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, కర్రి పాపారాయుడు, చింతలపాటి శ్రీనివాసరాజు, వంటెద్దు వెంకన్నాయుడు, పాటి శివకుమార్, కటకంశెట్టి ఆదిత్యకుమార్, కర్రి నాగిరెడ్డి, దూలం వెంకన్నబాబు, దంగేటి రాంబాబు, పార్టీ సీఈసీ, ఎస్‌ఈసీ సభ్యులు పితాని బాలకృష్ణ, కుడుపూడి బాబు, కాశి మునికుమారి, కుడుపూడి భరత్‌భూషణ్, పార్టీ రాష్ట్ర, జిల్లా అనుబంధ కమిటీల నాయకులు దంతులూరి రోహిత్ వర్మ, తెన్నేటి కిషోర్, గొవ్వాల రాజేష్, పాముల ప్రకాష్, ఉండ్రు వెంకటేష్, సరెళ్ల రామకృష్ణ, గొల్లపల్లి డేవిడ్ రాజు, మట్టపర్తి నాగేంద్ర, తోరం గౌతమ్ రాజా, జిన్నూరి వెంకటేశ్వరరావు, షేక్ అబ్దుల్ ఖాదర్, దొమ్మేటి సత్యమోహన్, జాన గణేష్, చీకట్ల కిషోర్, సూదా గణపతి, విత్తనాల మూర్తి, కముజు రమణ, అమలాపురం పట్టణ, పలు మండలాల పార్టీ అధ్యక్షులు సంసాని బులినాని, గుత్తుల చిరంజీవరావు, కొనుకు బాపూజీ, బద్రి బాబ్జి పాల్గొన్నారు.


