తొలి వంతెనకు వీడని కష్టాలు
కోనసీమ జిల్లాకు బాహ్య ప్రపంచంతో రాకపోకలు మొదలైంది రావులపాలెం–జొన్నాడ పాత వంతెనతోనే. గౌతమీ నదిపై తొలి వంతెనను నాటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పీడబ్ల్యూడీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించగా ఏప్రిల్ 20, 1967లో వినియోగంలోకి తీసుకువచ్చారు. 58 ఏళ్లు పూర్తయిన ఈ వంతెన తొలుత ఎన్‌హెచ్–16, తరువాత ఎన్‌హెచ్–216 పరిధిలో ఉంది. జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా వాజ్‌పాయి ప్రభుత్వ హయాంలో రెండో వంతెన నిర్మించారు. తరచూ ఎక్కడో అక్కడ దెబ్బ తింటుండడంతో రూ.కోట్లతో మరమ్మతులు చేశారు. ఈ నేపథ్యంలో 2022 మే నెలలో వాహనాల రాకపోకలు నిలిపివేసి తిరిగి 2023 ఏప్రిల్ నెలలో ప్రారంభించారు. ఐరెన్ రోప్‌లు, పిల్లర్లకు బేరింగ్‌లు మార్చారు. ఇది మరో 30 ఏళ్లు పనిచేస్తుందని అధికారులు చెప్పినా, వాహనాల సంఖ్య పెరగడంతో పదిహేనేళ్లు తరువాత మరోసారి మరమ్మతులు తప్పవని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తొలి వంతెనకు వీడని కష్టాలు


