పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడిగా ‘దీపాటి’
రాజోలు: పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడిగా దీపాటి సురేష్‌బాబు ఎన్నికయ్యారు. ఆదివారం పొదలాడలోని అల్లూరి సీతారామరాజు మెమోరియల్ పాఠశాలలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మిట్ట కృష్ణయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఎం గిరిప్రసాద్ ఆధ్వర్యంలో పీఆర్టీయూ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా దీపాటి సురేష్‌బాబు, ప్రధాన కార్యదర్శిగా మొంగం అమృతరావు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నాళం శ్రీనివాసరావులు ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై పీఆర్టీయూ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. సీఆర్పీలు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు, నైట్ వాచ్‌మెన్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై కృష్ణయ్యకు వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పంగం బ్రహ్మాజీరావు, కంకటాల చంద్రశేఖర్, యెరుబండి సత్యనారాయణ, కాకినాడ జిల్లా అధ్యక్షుడు చింతాడ ప్రదీప్‌కుమార్, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పళ్ల రాజారావు, మాజీ అధ్యక్షుడు తిలక్‌బాబు, నరా ల కృష్ణకుమార్, కె.సువర్ణరాజు, మామిడిశెట్టి గో పాలకృష్ణ, ఎల్.శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.
21న జాతీయ శతాధిక
కవి సమ్మేళనం
అమలాపురం టౌన్: స్థానిక వడ్డిగూడెంలోని కోనసీమ రెడ్డి జన సమైక్య వేమన కమ్యూనిటీ హాలులో ఈ నెల 21న శ్రీశ్రీ కళా వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో 160వ జాతీయ శతాధిక కవి సమ్మేళనం, పాటల స్వర వేదిక జరుగుతుందని ఆ వేదిక అంతర్జాతీయ సీఈఓ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ తెలిపారు. ఈ శతాధిక కవి సమ్మేళనానికి సంబంధించిన బ్రోచర్లను స్థానిక వడ్డిగూడెంలోని కోనసీమ వేమన కమ్యూనిటీ హాలులో డాక్టర్ ప్రతాప్, జిల్లా శ్రీశ్రీ కళావేదిక ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు నల్లా నరసింహమూర్తి, కోనసీమ రచయితల సంఘం అధ్యక్షుడు బీవీవీ సత్యనారాయణ, కవయిత్రి సబ్బెళ్ల వెంకట మహాలక్ష్మి, కవులు పొలమూరి వెంకట్, కళాకారుడు కడలి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నేడు ప్రజా సమస్యల
పరిష్కార వేదిక
అమలాపురం రూరల్: అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ గోదావరి భవన్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను సోమవారం యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ సమస్యలను ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకూ తెలపవచ్చన్నారు. జిల్లా స్థాయితో పాటు జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజనల్ అధికారుల కార్యాలయాల్లో, మండల తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో గ్రీవెన్స్ జరుగుతుందన్నారు.
నేడు పాఠశాల స్థాయి స్పెల్‌బీ పోటీలు
రాయవరం: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలు, శబ్దరచన సామర్థ్యం పెంపొందించడం, ఆత్మ విశ్వాసాన్ని ప్రోది చేయడం కోసం పాఠశాల, మండల, జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా సోమవారం పాఠశాల స్థాయిలో స్పెల్‌బీ పోటీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 22 మండలాల్లో 240 ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో స్పెల్‌బీ పరీక్షలు జరుపుతారు. అలాగే ఈ నెల 17న మండల స్థాయిలో స్పెల్‌బీ పోటీలు నిర్వహించాలి. ఈ మేరకు డీఈఓ పి.నాగేశ్వరరావు మండల విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకూ స్పెల్‌బీ పోటీలు నిర్వహించి మండల స్థాయికి ఏడుగురు విద్యార్థులను ఎంపిక చేయాలి. మండల స్థాయిలో నిర్వహించే పోటీల్లో ఉత్తమమైన ఏడుగురిని జిల్లా స్థాయికి పంపిస్తారు. మండల స్థాయిలో పోటీలు నిర్వహించడానికి అవసరమైన వెన్యూను ఎంపిక చేసి, సదుపాయాలను మండల విద్యాశాఖాధికారులు కల్పించాలని డీఈఓ సూచించారు. జిల్లా స్థాయిలో స్పెల్‌బీ పరీక్షలు నిర్వహించే తేదీ, వేదికను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు.
పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడిగా ‘దీపాటి’


