అయ్యప్ప సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
కపిలేశ్వరపురం (మండపేట): హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ ఆదివారం ద్వారపూడిలోని పలు దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు. తొలుత ఆంధ్ర శబరిమలైగా పేరుగాంచిన అయ్యప్పస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం గ్రామంలోని అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆయన కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయన వెంట జిల్లా న్యాయమూర్తులు గంధం సునీత, బెన్నయ్యనాయుడు, ఎల్.వెంకటేశ్వరరావు, శేషయ్య, ఆలమూరు కోర్టు జడ్జి ప్రవీణ్‌కుమార్, మండపేట తహసీల్దార్ తేజేశ్వరరావు, ఈఓపీఆర్‌డీ దాసరి శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి ఆకుల వెంకటరమణ, రూరల్ ఎస్సై వి.కిశోర్ ఉన్నారు.


