పవిత్రోత్సవాలు ప్రారంభం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో పురాణ ప్రసిద్ధి చెందిన జగన్మోహినీ కేశవ, గోపాలస్వామివారి క్షేత్రంలో స్వామివారి పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటా మార్గశిర బహుళ పంచమి నుంచి సప్తమి వరకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు మూడు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాలకు దేవస్థానం ఈఓ భాగవతుల వెంకటరమణమూర్తి ఆధ్వర్యాన శ్రీనివాసుల వెంకటాచార్యులు బ్రహ్మత్వంలో ప్రధానార్చకుడు, వేద పండితులు మంగళవారం ఉదయం శ్రీకారం చుట్టారు. కార్యక్రమాల్లో దేవస్థానం చైర్మన్ మెర్ల నాగేశ్వరరావు, పలువురు పాలకమండలి సభ్యులు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
పవిత్రోత్సవాలు ప్రారంభం


