çÜ…™èl-M>ÌS õÜMýS-Æý‡-׿ÌZ ˘ ‘అమలాపురం’ ప్రథమం
● మెడికల్ కళాశాలల
ప్రైవేటీకరణ దారుణం
● మాజీ మంత్రి విశ్వరూప్
అమలాపురం రూరల్: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో అమలాపురం నియోజకవర్గం జిల్లాలోనే ప్రఽథమస్థానం సాధించిందని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త పినిపే విశ్వరూప్ తెలిపారు. అమలాపురం మండలం భట్నవిల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి 60 వేల సంతకాలు సేకరించాలని పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారన్నారు. అమలాపురం నియోజకవర్గంలో అత్యధికంగా 75 వేల వరకు సంతకాలు సేకరించామన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాల పత్రుల బాక్సులు బుధవారం అమలాపురంలో తమ క్యాంపు కార్యాలయానికి చేరతాయన్నారు. వాటిని జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో అమలాపురం నుంచి తాడేపల్లికి 15వ తేదీన పంపిస్తామని వెల్లడించారు. 17న జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పాటు పార్టీ ముఖ్యనేతలు గవర్నర్‌కు అందజేస్తారన్నారు. పార్టీ అమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పినిపే శ్రీకాంత్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గపు చర్య అన్నారు. ఆ ప్రభుత్వం రూ. 2.30 లక్షల కోట్లు అప్పులు చేసి, కేవలం రూ.5,200 కోట్లు మెడికల్ కాలేజీలకు కేటాయించాలేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాస్, దంగేటి రాంబాబు, మున్సిపల్ చైర్మన్ రెడ్డి నాగేంద్రమణి, జెడ్పీటీసీలు పందిరి శ్రీహరి రామ్‌గోపాల్, కొనుకు గౌతమి, పట్టణ మండలాల అధ్యక్షులు సంసాని బులినాని, గుత్తుల చిరంజీవిరావు, బద్రి బాబ్జీ, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్, రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిక్కం సుబ్రహ్మణ్యం, జిల్లా అధికారి ప్రతినిధి సూదా గణపతి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సరేళ్ల రామకృష్ణ, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి ఉండ్రు బాబ్జీ, కౌన్సిలర్లు గొవ్వాల రాజేష్, నాగవరపు వెంకటేశ్వరరావు, కట్టోజు సన్నయిదాసు, కొల్లాటి దుర్గాబాయి, నాయకులు చొల్లంగి సుబ్బిరామ్, రేవు శ్రీనివాస్, ఈతకోట శ్రావణ్, కల్వకొలను ఉమ, విత్తనాల మూర్తి తదితరులు పాల్గొన్నారు.


