నిందితులను కఠినంగా శిక్షించాలి
ఐ.పోలవరం, ఆలమూరు: ఇదే‘వంట’ కూరగాయ ధరలు.. దిగిరాక జనం బెంబేలు.. కార్తిక మాసం వెళ్లినా, పంటలు చేతికి రాక, నెలలుగా అదే రేట్లు.. కొండెక్కి కూర్చున్న ధరలపై కానరాని ప్రభుత్వ చర్యలు.. ఫలితంగా ప్రజలకు తప్పని పాట్లు.. మార్కెట్‌లో కూరగాయ ధరలకు రెక్కలొచ్చి చాలా రోజులైంది. ఇప్పటి వరకూ కార్తిక మాసం ప్రభావం అని అంతా అనుకున్నారు. ఈ మాసం ముగిసినా కొండెక్కిన ధరలు మాత్రం దిగి రావడం లేదు. ఇప్పటికీ చిక్కుడు, క్యాప్సికం, మామిడి, అల్లం వంటి ధరలు కిలో సెంచరీపైనే ఉన్నాయి.
జిల్లాలో ప్రధాన హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ ఆలమూరు మండలం మడికిలో ఉంది. అలాగే రావులపాలెం, కొత్తపేట, అమలాపురంలో పెద్ద మార్కెట్లు ఉన్నాయి. ఆయా చోట్ల కూరగాయ ధరలు భారీగానే ఉంటున్నాయి. ఇక రిటైల్ మార్కెట్‌లో రేట్లు చూసి కొనేందుకు వినియోగదారులు వెనకడుగు వేస్తున్నారు. మార్కెట్‌లో కిలో చిక్కుడు కాయలు రూ.120 వరకూ ఉంది. బీరకాయలు రూ.80, దొండకాయలు రూ.50, క్యాబేజీ రూ.60, క్యాప్సికం రూ.120, బీట్‌రూట్ రూ.80, క్యారెట్ రూ.60, పది మామిడికాయలు రూ.160 వరకు ఉంది. పచ్చిమిర్చి రూ.60 వరకు ఉండగా, కొత్తిమీర కట్ట రూ.30 పలుకుతోంది. ఉల్లి కిలో రూ.25 నుంచి రూ.30 వరకూ ధర పలుకుతోంది. తెల్ల బీన్స్ గింజలు రూ.300 వరకూ పెరగడం గమనార్హం. అయితే ఉల్లి కిలో రూ.25కి వచ్చినా రెండో రకం (షోలాపూర్) మాత్రమే దొరుకుతున్నాయి. వీటిలో దెబ్బతిన్న పాయలు అధికంగా ఉంటున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. కార్తికం నుంచి ఇప్పటి వరకూ బాగా స్వల్పంగా ధరలు తగ్గినా, అది వినియోగదారులకు ధరాఘాతంగానే ఉన్నాయి.
వరదలు, వర్షాలతో..
ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాలతో కూరగాయ పంటలకు ఎక్కువగా నష్టం వాటిల్లింది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో గోదావరికి మూడుసార్లు వరదలు వచ్చాయి. వీటివల్ల కూరగాయ పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. దీనికితోడు ఈ ఏడాది నవంబర్‌లో కూడా గోదావరిలో వరద ఉధృతి కొనసాగింది. నవంబర్ 15వ తేదీన 65 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. దీనివల్ల గోదావరి లంక ప్రాంతాల్లో అక్టోబర్‌లో మొదలు కావాల్సిన కూరగాయల సాగు డిసెంబర్‌లో కాని మొదలు పెట్టే అవకాశం లేకుండా పోయింది. జిల్లాలోని అయినవిల్లి, పి.గన్నవరం, ముమ్మిడివరం, ఐ.పోలవరం, మామిడికుదురు, ఆత్రేయపురం, రావులపాలెం, కపిలేశ్వరపురం, కొత్తపేట లంక గ్రామాల్లో సుమారు 2 వేల ఎకరాల్లో కూరగాయల సాగు జరుగుతోంది. ఇక అక్టోబర్, నవంబర్ నెలల్లో భారీ వర్షాలు, మోంథా తుపాను వల్ల డెల్టాలోని మైదాన ప్రాంతాల్లో కూడా కూరగాయల పంట పెద్దఎత్తున దెబ్బతింది. దీనివల్ల స్థానికంగా కూరగాయలు లేకపోవడంతో మడికి, రావులపాలెం మార్కెట్‌లకు ఉమ్మడి జిల్లాలోని మెట్ట ప్రాంతాలైన తుని, ఏలేశ్వరం, రాజానగరం, పెద్దాపురం వంటి ప్రాంతాల నుంచి దిగుమతులపై పూర్తిగా ఆధారపడాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో ఇక్కడ రైతులు దుంప సాగు వదిలి కూరగాయ పంటలను అధికంగా సాగు చేస్తున్నారు. లేకపోతే కూరగాయల ధరలు మరింత పెరిగేవని వ్యాపారులు చెబుతున్నారు. కూరగాయలు అందుబాటులో లేని కారణంగానే కార్తిక మాసం ముగిసినా ధరలు దిగి రాలేదు.
అందుబాటులో లేక..
గతంలో పందిరి కూరగాయలు, ఆకు కూరలు మార్కెట్ అవసరాలకు 70 శాతం వరకూ ఉండేవని, ఇప్పుడు 30 శాతం కూడా అందుబాటులో లేవని మడికి మార్కెట్ హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. దీనివల్ల పూర్తిగా దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని అంటున్నారు. ఇక కర్నూలు, తాడేపల్లిగూడెం నుంచి కూడా దిగుమతి అవుతున్న ఉల్లిపాయలు ఎక్కువగా షోలాపూర్ రకానివే. పరిస్థితి చూస్తే మరో నెల రోజులు ఈ ధరలు ఇలానే ఉంటాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇది వినియోగదారులకు ఇబ్బందికరమైన పరిస్థితే. అయినా చంద్రబాబు ప్రభుత్వం కూరగాయ పంటలను ప్రోత్సహించడం కాని, వాటికి రాయితీలు పెంచడం కాని చేయడం లేదని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా రూ.వందలు లేనిదే సంచి నిండడం లేదని వ్యాపారులు వాపోతున్నారు.
ముమ్మిడివరం: స్థానిక డాక్టర్ బీఅర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి బాలికకు మాయ మాటలు చెప్పి వంచనకు గురిచేసిన మోకా గిరిబాబు, అతనికి సహకరించిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కాశి బాలమునికుమారి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆసుపత్రికిలో చికిత్స పొందుతున్న బాలికను ఆమె పరామర్శించారు. అనంతరం గురుకుల పాఠశాలను సందర్శించి జరిగిన దుర్ఘటనపై ఆరా తీశారు. మునికుమారి మాట్లాడుతూ మొన్న తునిలో, నిన్న ఐ.పోలవరంలో, నేడు ముమ్మిడివరంలో బాలికలను టార్గెట్ చేస్తూ టీడీపీ, జనసేన కార్యకర్తలు వంచనకు గురి చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇటీవల బాణాపురంలో బాలికపై అత్యాచారం కేసులో నిందితుడైన రాయపురెడ్డి బెయిల్‌పై వచ్చి బయట తిరుగుతున్నాడని, అతడిని చూసి బాలిక కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి డిల్లీనారాయణ, గంటి ఆకాష్, వెంకటరమణ, వి.వాసంతి పాల్గొన్నారు.
లంకల్లో దిగుబడి తగ్గింది
ఈ ఏడాది వరుసగా నాలుగు సార్లు సంభవించిన వరదల కారణంగా కూరగాయ తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇలా దిగుబడి క్రమేపీ తగ్గుతూ వచ్చింది. దీనివల్ల స్థానిక కూరగాయల సరఫరా లేక మెట్ట ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాలపై ఆధారపడాల్సి వస్తుంది. దీంతో ధరలు పెరుగుతూ వస్తున్నాయి.
– చెల్లుబోయిన సింహాచలం,
వ్యాపారి, మడికి,
ఆలమూరు
మండలం
ఫ కొండెక్కిన కూరగాయల ధరలు
ఫ కార్తిక మాసం వెళ్లినా అదే రేట్లు
ఫ బెంబేలెత్తిపోతున్న ప్రజలు
నిందితులను కఠినంగా శిక్షించాలి
నిందితులను కఠినంగా శిక్షించాలి
నిందితులను కఠినంగా శిక్షించాలి


