మడికి మార్కెట్‌పై ప్రభావం
కార్తిక మాసంలో అంచనాలకు మించి కూరగాయల ధరలు పెరిగాయి. ఇది ఆలమూరు మండలం మడికి మార్కెట్‌పై ప్రభావం చూపింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో అతి పెద్ద కూరగాయల మార్కెట్‌లో మడికి ఒకటి. ఉల్లి కొనుగోలు మినహాయిస్తే ఇదే అతి పెద్దది. మొత్తం ఇక్కడ 60 వరకూ హోల్‌సేల్ దుకాణాలు ఉన్నాయి. చిన్నాపెద్ద కలిపి సుమారు 300 మంది వరకూ ఉపాధి పొందుతున్నారు. లారీలు, మినీ వ్యాన్లు, ఆటోలు ఇలా వందల మందితో నిత్యం సందడిగా ఉంటోంది. కూరగాయల ధరలు పెరగడంతో ఈ మార్కెట్‌లో లావాదేవీలు సంగం కన్నా తగ్గిపోయాయి. ఉమ్మడి జిల్లాలో మెట్టతో పాటు జిల్లాలో లంక గ్రామాల నుంచి కూరగాయలు వచ్చినప్పుడు ఇక్కడ రోజుకు సుమారు 20 టన్నుల వరకు సరకు వచ్చేది. ఇప్పుడు కేవలం మెట్ట నుంచి వచ్చే కూరగాయలపైనే ఆధారపడాల్సి రావడంతో రోజుకు కేవలం సుమారు 8 టన్నుల మాత్రమే వస్తుంది. వచ్చే ఏడాది జనవరి వరకూ పంట అందుబాటులోకి రాదు. అప్పటివరకూ ఇదే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల సగం మంది కార్మికులకు ఉపాధి లేకుండా పోతోంది.


