పారదర్శకంగా ఇసుక సరఫరా చేయాలి
అమలాపురం రూరల్: జిల్లాలో ఉచిత ఇసుక పాలసీకి అనుగుణంగా ఇసుక తవ్వకాలు, సరఫరా పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ కమిటీ సభ్యులకు సూచించారు. శుక్రవారం అమలాపురంలోని కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రస్తుత ఇసుక నిల్వలు, ఇప్పటి వరకూ నిర్వహించిన లావాదేవీలు, ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థ, అక్రమ తవ్వకాలపై చర్యలు వంటి అంశాలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ఇసుక నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. తొమ్మిది ఇసుక రీచ్‌లలో ఈ నెల 15వ తేదీ నుంచి తిరిగి ఇసుక తవ్వకాలు పునః ప్రారంభించాలని ఆదేశించారు. జేసీ నిషాంతి, భూగర్భ గనుల శాఖ ఏడీఎల్ వంశీధర్‌రెడ్డి, రహదారులు, భవనాల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ బి.రాము, భూగర్భ జల శాఖ ఏడీ ప్రత్యూష, డీటీఓ డి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఫ కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశాలను అనుసరించి సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఈ నెల 7న నిర్వహించనున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు జిల్లా సైనిక బోర్డు చైర్మన్ ఎస్‌కే నవాబ్ జాన్ అధ్యక్షతన పతాక దినోత్సవాన్ని ప్రారంభించారు. దేశ రక్షణ కోసం సాయుధ దళాలు చేస్తున్న కృషి, వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ వారి కుటుంబాలకు మొదటి విరాళాన్ని కలెక్టర్ అందించారు. సాయుధ దళాల పతాక నిధికి ఉద్యోగులు, వివిధ సంస్థలు, ప్రజలు విరివిగా విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
కలెక్టర్ మహేష్ కుమార్


