సాధించార్
● సైన్స్ ప్రదర్శనల్లో జిల్లా ముందంజ
● ఢిల్లీ టూర్‌కు నలుగురు విద్యార్థినులు
● ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకునే అవకాశం
● నేటి నుంచి 8 వరకూ పర్యటన
రాయవరం: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్ఫథాన్ని పెంపొందించేందుకు, వారిలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా నూతన ఆవిష్కరణలకూ అవకాశం కలుగుతుంది. దీని కోసం ఇన్‌స్ఫైర్ మనాక్, సైన్స్ ఫేర్, చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ తదితర కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. వీటిలో చురుగ్గా పాల్గొన్న పాఠశాలలకు చెందిన నలుగురు విద్యార్థినులు ఢిల్లీ సైన్స్ ఎక్స్‌పోజర్ విజిట్‌కు ఎంపికయ్యారు. ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకోవడంతో పాటూ తొలిసారిగా విమానం ఎక్కి పయనించే అవకాశాన్ని ఈ విద్యార్థులు దక్కించుకున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీం బాషా పర్యవేక్షణలో, జిల్లా సైన్స్ అధికారి మార్గదర్శకత్వంలో ఈ విద్యార్థులు మంగళవారం ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ముఖాముఖి సదస్సు
ఢిల్లీ సైన్స్ ఎక్స్‌ప్లోజర్ అండ్ ఎడ్యుకేషనల్ టూర్‌కు ఎంపికై న విద్యార్థులు నాసా ఇంజినీర్లతో ముఖాముఖి సదస్సులో పాల్గొంటారు. స్టెమ్ ఎడ్యుకేటర్ గేబే ఆధ్వర్యంలో ఇంటరాక్టివ్ సెషన్స్, ప్రాక్టికల్ సైన్స్ వర్క్‌షాప్‌లో పాల్గొనే అవకాశం కూడా కలుగుతుంది. ఢిల్లీలో నెహ్రూ ప్లానిటోరియం, నేషనల్ సైన్స్ మ్యూజియం, రష్యన్ సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ కల్చర్ వంటి జాతీయ విజ్ఞాన సంస్థలను సందర్శిస్తారు.
ఎంపికై న విధానం
స్పేస్ వీక్ – సైన్స్ ఎక్స్‌పోజర్ అండ్ ఎడ్యుకేషనల్ టూర్‌కు జిల్లా నుంచి నలుగురు విద్యార్థినులు ఎంపికయ్యారు. ఈ పర్యటనకు దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఇద్దరిని మాత్రమే ఎంపిక చేయగా, మన జిల్లా నుంచి నలుగురికి అవకాశం లభించడం విశేషం. వీరందరూ ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ ఢిల్లీలో జరిగే సైన్స్ పోజర్ విజిట్‌లో పాల్గొంటారు. అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం పాఠశాల విద్యార్థులు రెండు సార్లు ధీరూబాయి అంబానీ క్విజ్‌లో స్టేట్ సైన్స్‌ఫేర్‌కు ఎంపికయ్యారు. అలాగే అమలాపురం మహాత్మాగాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఇన్‌స్ఫైర్ నేషనల్‌కు అర్హత సాధించింది. కె.గంగవరం జెడ్పీ ఉన్నత పాఠశాల వరుసగా మూడు సార్లు రాష్ట్ర స్థాయి సైన్స్‌ఫేర్‌కు ఎంపికై ంది. ఇలా సైన్స్‌ఫేర్, సైన్స్ డ్రామా, సైన్స్ ఫెస్టివల్స్‌లో నిరంతరం భాగస్వామ్యం వహిస్తున్న పాఠశాలల నుంచి విద్యార్థులను రాష్ట్ర విద్యాశాఖ, సమగ్ర శిక్షా అధికారులు ఈ టూర్‌కు ఎంపిక చేశారు.
స్ఫూర్తిగా తీసుకోవాలి
విద్యార్థి దశ నుంచే పిల్లల్లోని సృజనాత్మతకు ఉపాధ్యాయులు పదును పెట్టాలి. అప్పుడే వారికి పరిశోధనలపై జిజ్ఞాస పెరుగుతుంది. ప్రతి విద్యార్థి ఏదో ఒక అంశంలో రాణిస్తాడు. ఆ విషయాన్ని ఉపాధ్యాయులు గుర్తించినప్పుడే ప్రతిభ బయటకు వస్తుంది.
– షేక్ సలీం బాషా, జిల్లా విద్యాశాఖాధికారి
జిల్లాకు గర్వకారణం
రాష్ట్ర స్థాయిలో సైన్స్ పరంగా జిల్లా ముందంజలో ఉంటోంది. ఇక్కడి నుంచి నలుగురు విద్యార్థులు సైన్స్ ఎక్స్‌పోజర్ విజిట్‌కు ఎంపిక కావడం గర్వకారణం. భవిష్యత్తులో జిల్లా విద్యార్థులు మరింత ప్రతిభ కనబరుస్తారన్న నమ్మకం ఉంది.
– జీవీఎస్ సుబ్రహ్మణ్యం, జిల్లా సైన్స్ అధికారి
సాధించార్
సాధించార్


