బాలికపై అత్యాచారం చేసిన నిందితుడి అరెస్టు
ఐ.పోలవరం: బాలికకు చాక్లెట్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన బాణాపురానికి చెందిన రాయపరెడ్డి సత్య వెంకట కృష్ణ (బాబీ)ని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్ పాత ఇంజరం పోలీస్ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. తినుబండారాలు ఇచ్చి బాలికను బలాత్కారం చేసినట్లు నిందితుడు ప్రాథమిక విచారణలో అంగీకరించాడన్నారు. బాలిక ఇంటికి అక్టోబర్ 25న వెళ్లి చాక్లెట్లు ఇవ్వటం ఇస్తుండగా తల్లి గమనించిందని, దీనిపై బాలికను నిలదీయగా నిందితుడి ఘాతుకాన్ని బాలిక తన తల్లికి చెప్పిందన్నారు. దీనిపై ఆమె తన కుటుంబ సభ్యులతో చర్చించి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిందని, ఆ మేరకు ఐ.పోలవరం పోలీసులు కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ తెలిపారు.
గతంలోనూ పలు కేసులు
రాయపురెడ్డి బాబీపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. అతనిపై 2001, 2002 సంవత్సరాలలో ఐ.పోలవరం పోలీస్ స్టేషన్‌లో రెండు మోటార్ సైకిల్ దొంగతనం కేసులు, రాజానగరం పోలీస్ స్టేషన్‌లో 2005లో ఒక దొంగనోట్ల మార్పిడి కేసు, గతంలో సస్పెక్టెడ్ షీట్‌గా ఉన్నాయని తెలిపారు.


