కోరుకొండ
కోరుకొండ: గ్రామంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తుల రాక ఎక్కువగా ఉంటుంది. కార్తిక మాసం కావడంతో సాధారణ భక్తులతో పాటు, అయ్యప్ప మాలధారులు అధికంగా తరలివస్తున్నారు. ముఖ్యంగా కొండపైన ఆలయానికి వెళ్లేందుకు సుమారు 630 మెట్లు ఎక్కాలి. ఆ మార్గం ఇరుకుగా ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కొండపై ఆలయంలో విద్యుత్, తాగునీటి సమస్యలు వేధిస్తున్నాయి. ప్రధానంగా మెట్లు ఎక్కే భక్తులపై కోతులు దాడి చేస్తున్నాయి. వాటి నుంచి రక్షణకు చర్యలు చేపట్టాలి. స్వామివారి క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, స్నానాలగదులు నిర్మించాలి.


