లీప్ యాప్‌లో పోస్టింగ్ ఆర్డర్ల విడుదల
రాయవరం: డీఎస్సీ–2025 ఉపాధ్యాయులు సోమవారం కొలువుదీరనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 20న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1,241 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. 1,230 పోస్టులకు పోస్టింగ్ ఆర్డర్లు విడుదలయ్యాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 414 మంది ఉపాధ్యాయులు విధుల్లో చేరనున్నారు. వీరిలో 28 మంది మున్సిపల్ యాజమాన్యాల్లో నియామకం పొందగా, ప్రభుత్వ/స్థానిక సంస్థల యాజమాన్యాల్లో 386 మంది చేరనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 164 మంది ఉపాధ్యాయులను కేటాయించగా, వీరిలో 53 మంది మున్సిపల్ కార్పొరేషన్, 111 మంది ప్రభుత్వ/స్థానిక సంస్థల యాజమాన్యాల పరిధిలో నియామకం పొందారు. కాకినాడ జిల్లాకు వివిధ కేటగిరీలకు చెందిన 474 మంది ఉపాధ్యాయులు నియామకం పొందగా వీరిలో 124 మంది మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్‌లో నియామకం పొందగా, 350 మంది ప్రభుత్వ/స్థానిక సంస్థల్లో నియమితులయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 173 మంది ప్రభుత్వ/స్థానిక సంస్థల యాజమాన్యాల పరిధిలో వివిధ క్యాటగిరీల కింద నియామకం పొందారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి తరఫున నియామకపు ఉత్తర్వులు లీప్ యాప్‌లో జారీ చేశారు. ఉపాధ్యాయులు సోమవారం వారికి కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరతారు.
కేటాయించిన పోస్టుల వివరాలిలా..
కాకినాడ జిల్లా
కేటగిరీ పోస్టు మున్సిపల్ ప్రభుత్వ/
స్థానిక సంస్థలు
ఎస్‌ఏ ఇంగ్లిషు 03 34
ఎస్‌ఏ హిందీ 02 26
ఎస్‌ఏ తెలుగు 04 16
ఎస్‌ఏ బీఎస్ 06 50
ఎస్‌ఏ గణితం 02 41
ఎస్‌ఏ పీఈ 0 66
ఎస్‌ఏ పీఎస్ 0 43
ఎస్‌ఏ ఎస్‌ఎస్ 5 50
ఎస్‌జీటీ 102 24
కోనసీమ జిల్లా
కేటగిరీ పోస్టు మున్సిపల్ ప్రభుత్వ/
స్థానిక సంస్థలు
ఎస్‌ఏ ఇంగ్లిషు 18 105
ఎస్‌ఏ హిందీ 03 45
ఎస్‌ఏ తెలుగు 01 14
ఎస్‌ఏ బీఎస్ 0 91
ఎస్‌ఏ గణితం 01 06
ఎస్‌ఏ పీఈ 02 20
ఎస్‌ఏ పీఎస్ 0 31
ఎస్‌ఏ ఎస్‌ఎస్ 0 05
ఎస్‌జీటీ 18 105
తూర్పుగోదావరి జిల్లా
కేటగిరీ పోస్టు మున్సిపల్ ప్రభుత్వ/
స్థానిక సంస్థలు
ఎస్‌ఏ ఇంగ్లిషు 02 06
ఎస్‌ఏ హిందీ 0 06
ఎస్‌ఏ తెలుగు 01 02
ఎస్‌ఏ బీఎస్ 0 19
ఎస్‌ఏ గణితం 0 05
ఎస్‌ఏ పీఈ 0 42
ఎస్‌ఏ పీఎస్ 2 04
ఎస్‌ఏ ఎస్‌ఎస్ 6 17
ఎస్‌జీటీ 42 10
ఏఎస్‌ఆర్ జిల్లా
కేటగిరీ పోస్టు మున్సిపల్ ప్రభుత్వ/
స్థానిక సంస్థలు
ఎస్‌ఏ ఇంగ్లిషు 0 17
ఎస్‌ఏ హిందీ 0 01
ఎస్‌ఏ తెలుగు 0 04
ఎస్‌ఏ బీఎస్ 0 05
ఎస్‌ఏ గణితం 0 09
ఎస్‌ఏ పీఈ 0 09
ఎస్‌ఏ పీఎస్ 2 07
ఎస్‌ఏ ఎస్‌ఎస్ 6 02
ఎస్‌జీటీ 0 119