
చదువుకున్న స్కూల్‌కే ఉపాధ్యాయురాలిగా...
అయినవిల్లి: మండలంలోని క్రాప గ్రామానికి చెందిన చిక్కం లక్ష్మి ఇటీవల జరిగిన డీఎస్సీ–2025 పరీక్షలో స్కూల్ అసిస్టెంట్ హిందీ పండిట్ విభాగంలో జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అంతేకాకుండా తాను చదువుకున్న కె.జగన్నాథపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లోనే పోస్టింగ్ దక్కించుకోవడం విశేషం. ఆమె సోమవారం స్కూల్‌లో విధుల్లో జాయిన్ కానున్నారు. ఇకపై తాను చదువుకున్న తరగతి గదుల్లోనే ఆమె ఉపాధ్యాయురాలిగా విద్యార్థులకు హిందీ పాఠాలు బోధించనున్నారు. అరుదైన ఈ ఘనత సాధించిన లక్ష్మికి ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.