
భారీగా బాణసంచా స్వాధీనం
అల్లవరం: బోడసకుర్రు పోస్టాఫీస్ సమీపంలో నిల్వ ఉంచిన మందుగుండు సామగ్రిని అల్లవరం పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఎస్సై సంపత్‌కుమార్ ఆధ్వర్యంలో అల్లవరం పోలీసులు దాడి చేసి బాణసంచాను గుర్తించారు. బోడసకుర్రు పోస్టాఫీస్‌ను ఆనుకుని కిరాణా వ్యాపారం చేస్తున్న జక్కా కామేశ్వరరావు ఇంటి వెనుక బాత్‌రూమ్‌లో నిల్వ చేసిన బాణసంచాను సీఐ ప్రశాంత్‌కుమార్, తహసీల్దార్ వీవీఎల్ నరసింహారావు సమక్షంలో మూటలుగా కట్టి ట్రాక్టర్‌లోకి లోడ్ చేసి నిశిద్ధ ప్రదేశానికి తరలించారు. ఈ బాణసంచా విలువ రూ.1.94 లక్షలు ఉంటుందని సీఐ ప్రశాంత్‌కుమార్ తెలిపారు. అనుమతులు లేకుండా బాణసంచా నిల్వ చేసినా, తరలించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.