
పెన్షన్ వేలిడేషన్ చట్టం రద్దు చేయాలి
రాజమహేంద్రవరం సిటీ: పెన్షన్ వేలిడేషన్ చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని, వెంటనే 8వ కేంద్ర పే కమిషన్ ఏర్పాటు చేయాలని ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్స్ చైర్మన్ డి.తిరుపతిరావు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం సంచార భవన్ ఎదుట పెన్షనర్లు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు పెన్షనర్లు పాల్గొని పెన్షన్ వేలిడేషన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో కన్వీనర్లు కె.భాస్కరరావు, కేవీఎస్ రాజు, పోస్టల్, టెలికమ్యూనికేషన్స్ (బీఎస్‌ఎన్‌ఎల్) పెన్షనర్లు పాల్గొన్నారు.