
భర్త ఆత్మహత్య
సీతానగరం: భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని హెడ్ కానిస్టేబుల్ రేలంగి శ్రీనివాస్ సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నాగంపల్లికి చెందిన గుడాల ప్రసన్న కుమార్ (34) భార్యపై అనుమానం పెంచుకుని మనస్థాపంతో ఉన్నాడు. ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పనిలోకి వస్తానని చెప్పి రాకపోవడంతో స్థానికులు మధ్యాహ్నం ఇంటికి వెళ్లగా అతను ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అల్లంపల్లి రాంబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు