
యువకుడి బలవన్మరణం
సీతానగరం: జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై డి.రామ్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. సీతానగరం మండలం మునికూడలికి చెందిన మురాల అనిల్‌దేవ (22) వెల్డర్‌గా పని చేస్తున్నాడు. తల్లి కువైట్‌లో ఉండటంతో అమ్మమ్మ నూకతట్ల సుభద్రమ్మ వద్ద ఉంటున్నాడు. ఉదయం పనిపై వేరే వీధిలోకి సుభద్రమ్మ వెళ్లగా, ఇంట్లో ఫ్యాన్‌కు అనిల్‌దేవ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుభద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నామని ఎస్సై వివరించారు.